Breaking News

01/08/2019

బిజెపి అంటే కెసిఆర్ కు వణుకు పుట్టుకుంది: డీకే అరుణ

మహబూబ్ నగర్ ఆగష్టు 1  (way2newstv.in)
బిజెపి అంటే కెసిఆర్ కు వణుకు పుట్టుకుందని మాజీమంత్రి డీకే అరుణ అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా లోని మర్లు, ఆదర్శ్ కాలనీ ,శాంతి నాగర్ కాలనీ లో  సభ్యత నమోదు కార్యక్రమం లో మాజీ మంత్రి వర్యులు డి.కె.అరుణమ్మ గారు, మాజీ ఎంపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షురాలు పద్మజ రెడ్డిలు పాల్గొన్నారు.
బిజెపి అంటే కెసిఆర్ కు వణుకు పుట్టుకుంది: డీకే అరుణ

ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి మాట్లాడుతున్నారని బిజెపి అంటే భయపడే స్థితికి వెళ్ళిపోయాడు అని ఆమె అన్నారు హరితహారం లో భాగంగా సర్పంచులు మొక్కలు నాటితే ఆ మొక్కలు ఎండిపోయిన దానికి బాధ్యతగా పదవులకు రాజీనామా  చేయాలనడం ఆయన పిచ్చికి పరాకాష్ట అన్నారు తన పదవిని ఒకలాగా ఇతరుల పదవి ఒకలాగా చూస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆయన చేష్టలు మాటలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు..

No comments:

Post a Comment