Breaking News

30/08/2019

ఇక ఫిట్ ఇండియాకు శ్రీకారం

న్యూఢిల్లీ, ఆగస్టు 29, (way2newstv.in)
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీకారం చుట్టారు. ‘ఫిట్ ఇండియా’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, క్రీడల మధ్య అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన మోదీ మాట్లాడుతూ... అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవనవిధానంపై పెను ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. ఫిట్‌నెస్ ఎల్లప్పుడూ మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది కానీ, ప్రస్తుతం వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధలోపించిందని మోదీ అన్నారు. 
ఇక ఫిట్ ఇండియాకు శ్రీకారం

కొన్ని దశాబ్దాల కిందట సాధారణ మనిషి రోజుకు 8 నుంచి 10 కిలోమీటర్ల నడవం లేదా పరుగెత్తేవాడని పేర్కొన్నారు. సాంకేతికత వల్ల మనిషికి శారీరక శ్రమ తగ్గిపోయిందని, ఇప్పుడు చాలా తక్కువ నడుస్తున్నాం.. కానీ మనకు తగినంత నడక, వ్యాయామం లేదని అదే సాంకేతిక పరిజ్ఞానం చెబుతోందని అన్నారు. ఫిట్‌నెస్‌ ఇండియా దేశాన్ని ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు సహా ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైవారికి ఈ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు అందజేశారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, టెన్నిన్ సహా ఏ ఆటల్లో అయినా మన క్రీడాకారులు సాధించిన విజయాలు ఆటలపై ఔత్సాహికులకు మరింత ప్రేరణ కల్పిస్తున్నాయని అన్నారు. వారు సాధించిన పతకాలు క్రీడాకారుల శ్రమకు ప్రతిఫలం మాత్రమే కాదు, నవ భారతవాని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంతి రిజుజు మాట్లాడుతూ.. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రజల సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి రోజును ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి. రోజూ వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ లాంటివి చెయ్యాలి. ఒంట్లో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు, అధిక బరువును తొలగించుకోవాలి. అందుకోసం ఉద్దేశించిందే ఫిట్ ఇండియా ఉద్యమం. 

No comments:

Post a Comment