Breaking News

16/08/2019

10 కోట్ల క్లబ్ లో సంపూర్ణేష్ బాబు

హైద్రాబాద్, ఆగస్టు 16 (way2newstv.in)
బాక్సాఫీస్ ను కలెక్షన్లతో బర్న్ చేసేస్తున్నాడు సంపూర్నేష్ బాబు. బర్నింగ్ స్టార్ గా హృదయకాలేయం సినిమాతో సంచలనం సృష్టించిన సంపూ కొబ్బరిమట్టతో మరోసారి రెచ్చిపోయాడు. మూడు పాత్రల్లో మెరిసి.. గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పి.. అందర్నీ ఆకర్షించాడు సంపూ. ఐదేళ్ళు తాము పడ్డ కష్టానికి సంతోషకరమైన విజయాన్ని అందుకుంది కొబ్బరిమట్ట యూనిట్. శనివారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించింది. 
10 కోట్ల క్లబ్ లో సంపూర్ణేష్ బాబు

ఈ సందర్భంగా ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మూడు రోజుల్లో 12 కోట్లు అని పెట్టి.. పక్కన చుక్క పెట్టారు. కింద చుక్క పెట్టి పక్కన 9 కోట్లు ఎక్కువ చేసి చూపించాం.. ఫ్యాన్స్ కోరిక మేరకు అంటూ రాశారు.  సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కత్తి మహేష్ ఈ సినిమా కలెక్షన్ రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 1.17 కోట్ల షేర్, రూ. 2.2 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 2 కోట్లు జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం 'కొబ్బరి మట్ట' రూ. 2.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే రూ. 2.2 కోట్ల గ్రాస్ రాబట్టింది' అంటూ అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తమ్మీద సంపూర్నేష్ బాబు హిట్ కొట్టాడు. కొబ్బరిమట్ట తో కలెక్షన్ల సునామీ రాబడుతున్నాడు. 

No comments:

Post a Comment