అమరావతి, ఆగష్టు 16 (way2newstv.in)
శుక్రవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయన నివాసం పైకి డ్రోన్ ప్రయోగించిన ప్రయివేటు వ్యక్తులని తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు పై దాడి చేసేందుకు రహస్యంగా ఇంటి భద్రత,సెక్యూరిటీ ఉండే ప్రదేశాలు చిత్రీకరిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేసారు. విషయం తెలియగానే పార్టీ నేతలు టీడీ జనార్ధన్, దేవినేని అవినాష్, ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నారు.
చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ వాడిన ఇద్దరు వ్యక్తులు
ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు డ్రోన్ ప్రయోగించిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో జరిగిన దానిపై నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం అంటూ టీడీ జనార్దన్, దేవినేని అవినాష్ ఆందోళనకు దిగారు. పోలీసు జీపు కు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. డ్రోన్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా ఎస్పీ, డీజీపీతో ఫోనులో మాట్లాడారు.– హైసెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎగరేయడంపై నిలదీసారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు..అనుమతులు ఎవరిచ్చారు? – డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగరేయడానికి వీల్లేదు – అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా? – నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు? – చివరికి నా భద్రతనే ప్రశ్నార్ధకంగా మారుస్తారా? – డ్రోన్లు ఎగరేస్తూ పట్టుబడిన వ్యక్తులు ఎవరు? – ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడింది ఎవరో తెలియజేయాలి – నిఘా వేసిందెవరో, దాని వెనుక కుట్ర ఏంటో తెలియజేయాలని అయన డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment