హైదరాబాద్, జూలై 23 (way2newstv.in)
తెలంగాణ లో బీజేపీ బలపడుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ పదవులు కావాలని ఏవరు కోరుకోరు .అనుకున్నట్లుగానే ప్రస్తుతం టీ బీజేపీ లో పార్టీ పదవుల కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది.. ఈ పదవుల పై బీజేపీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. డిసెంబర్ లో పార్టీ కి సంబంధించిన అన్ని స్థాయిల్లో కొత్త నాయకత్వానికి భాధ్యతలు అప్పగించనుంది అదిష్టానం... అయితే ఇప్పటికే పలువురు పార్టీ నేతలు తమ తమ స్థాయిల్లో పార్టీ పదవుల కోసం కేంద్ర నాయకత్వం దగ్గర లాబీయింగ్ చేయడం మొదలు పెట్టారట...ఇది తెలిసిన పార్టీ ఛీఫ్ అమిత్ షా ముందు మెంబర్ షిప్ డ్రైవ్ పై దృష్టి పెట్టండి ఆ తర్వాత పదవుల గురించి ఆలోచిద్దాం అని సూచించారట.
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్
ఇది ఇలా ఉంటె పార్టీ పదవులు గతంలో అనుభవించిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారట కొంత మంది బీజేపీ నేతలు ,ఎన్నో ఎళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పార్టీ పదవులు మాత్రం ఇవ్వట్లేదని అసహనం ఆ నేతల్లో ఉందని ఈ అంశాన్ని కేంద్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు ఆ నేతలు....ప్రస్తుతం పార్టీ పదవులు అనుభవిస్తున్న నేతలు మాత్రం మరో సారి ఇదే కార్యవర్గాన్ని కొనసాగించాలని కోరుతున్నారు... ప్రస్తుతం పార్టీ బలపడుతున్న సమయంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ లో చేరికలు ,పార్టీ కార్యక్రమాలపై ఎఫెక్ట్ పడుతుందని సూచిస్తున్నారని సమాచారం.. ఇదిలా ఉంటె పార్టీ లో ప్రస్తుతం చేరిన ,చేరబోయే నాయకులకు ,పాత నాయకుల మధ్య పార్టీ పదవుల కోసం కోల్డ్ వార్ జరిగే అవకాశం లేకపోలేదు .ప్రస్తుతం పార్టీ లో చేరేవారంతా పార్టీ పదవుల పై ఆశతోనే చేరుకున్నారు ,పార్టీ నాయకులు కూడా ఏదో ఓక పదవి ఇస్తామని చెప్పి పార్టీ చేర్చుకుంటుంన్నారు అనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతుంది... ఇదేగనుక నిజమైతే పాత కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉండబోతోంది..కొన్నేళ్లుగా ఎటువంటి పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీ లో గ్రూపులు తయారవ్వడం ఖాయం ..అదే జరిగితే పార్టీ పతనానికి పార్టీ నాయకులే నాంది పలికినట్లు అవుతుంది.. పార్టీ ఈ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఎన్నికల సమయానికి కుంపట్లు, అసహనాలు బయటపడి కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీ కి పట్టే అవకాశం లేకపోలేదు .
No comments:
Post a Comment