Breaking News

23/07/2019

తెలుగు రాష్ట్రాలు...

రెడ్లతో కమలం అడుగులు
హైద్రాబాద్, జూలై 23, (way2newstv.in)
రాజకీయ పరమపధ సోపానాన్ని అధిరోహించాలన్నది తెలుగు రాష్ట్రాల బీజేపీ కల. అది నెరెవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఇపుడు బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణాలో తాజా ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి సరికొత్త ఆశలు మొదలయ్యాయి. రేపటి రోజున తెలంగాణల్లో కమలవికాసం ఖాయమని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. తెలంగాణాలో డైనమిక్ లీడర్ కిషన్ రెడ్డిని కేంద్రంలో తన శాఖానే సగమిచ్చి మంత్రిగా తీసుకుని అమిత్ షా రాజకీయ పాఠాలు బోధిస్తున్నారు. టీఆర్ఎస్ ని ఎలా కొట్టాలో కూడా మెలకువలు చెబుతున్నారు. తెలంగాణాలో వెలమ పాలన సాగుతోంది. అందువల్ల బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లు రాజకీయ వాటా దొరక్క సతమతమవుతున్నారు. 
తెలుగు రాష్ట్రాలు... 

వారిని తమ వైపునకు తిప్పుకోవడానికే బీజేపీ తెలివిగా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేసింది. కిషన్ రెడ్డి కూడా మంచి మాటకారి. అనేక ఉద్యమాలను చేసిన వాడు. ఆయన చురుకుదనం, కులబలం పెట్టుబడిగా పెట్టి రేపటి రోజున తెలంగాణా గెలవాలని బీజేపీ ఆలోచనగా ఉంది.ఇక ఏపీలో చూసుకుంటే జగన్ రెడ్డి సామాజికవర్గంలో ఏకైక నాయకునిగా ఉన్నారు. ఆ వర్గాన్ని ఆకట్టుకుంటేనే తప్ప బీజేపీకి విజయం సాధ్యం కాదు. కమ్మ సామాజికవర్గం ఎటూ బీజేపీకి కొంత బలంగా ఉంది. టీడీపీ ఎంత బలహీన పడితే అంతలా ఆ వర్గం బీజేపీ చెంతన చేరడం ఖాయం. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అధికారంలో ఉన్న జగన్ ని దెబ్బతీయాలంటే ఆయన ఆయువు పట్టుగా ఉన్న రెడ్లను చేరదీయాలి. అందుకే ఆ వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని తురుపు ముక్కలా ప్రయోగించాలనుకుంటోంది. కిరణ్ కూడా వైఎస్సార్ శిష్యుడే. కాంగ్రెస్ లో సీమకు చెందిన కీలక నేత. అయితే సొంత బలం లేకపోవడం వల్ల వెనక్కివెళ్లిపోయారు. ఆయన పాలన పట్ల జనంలో కొంత మంచి అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఆయనికి పార్టీ బలం ఇవ్వడం ద్వారా గట్టిగా ఫోకస్ చేస్తే జగన్ కి ప్రత్యామ్న్యాయ నేత అవుతారని బీజేపీ ఆశ పెట్టుకుంటోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గాన్ని దువ్వడం ద్వారానే అధికార పీఠాన్ని అందుకోగలమని బీజేపీ గట్టి అంచనాలే వేసుకుంది. కాంగ్రెస్ జమానాలో ఉమ్మడి ఏపీలో రెండ్లు దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించారు. ఇపుడు కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వారు సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు. అందువల్ల వారిని చేరదీసి ఆదరిస్తే కాంగ్రెస్ తరహాలోనే తెలుగు రాష్ట్రాలల్లో అధికారం చెలాయించవచ్చునని బీజేపీ అనుకుంటోంది. ఇక తెలంగాణాలో, ఏపీలో బీజేపీ వేస్తున్న ఈ ఎత్తులు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు. జగన్, కేసీఆర్ ను మరో వైపు చంద్రబాబుని ఎదుర్కొనే దమ్మున్న అభ్యర్ధులుగా వీరు ఎంతవరకు నిరూపించుకుంటారో కూడా చూడాలి.

No comments:

Post a Comment