Breaking News

25/07/2019

ధరణికి టెక్నికల్ సమస్యలే మెండు

అదిలాబాద్, జూలై 25, (way2newstv.in)
రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించిన రికార్డులన్నీటిని క్రమబద్దీకరించి అవసరమైన ధృవ పత్రాల జారీ క్రయవిక్రయాల నమోదు, సవరణలు లాంటి కార్యకాలపాలను నిర్వహించేందుకు అమలుచే తలపెట్టిన ధరణి వెబ్‌సైట్ ఇప్పటికి కార్యరూపం దాల్చకపోతుండడం రైతులకు శాపంగా మారిందంటున్నారు. ప్రభుత్వం ఆఘమేఘాల మీద చేపడుతున్న సంస్కరణలు వికటిస్తుండడం అన్ని వర్గాల వారిని నిరాశ పరుస్తుంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇటీవల చెక్కులతో పాటు డిజిటల్ పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేసిన వ్యవహారం ఇప్పటీకి పూర్తి స్థాయికి చేరుకోకపోతుండడం విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ దాదాపు 50 శాతం మంది రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు కానీ చెక్కులు కానీ అందకపోవడం గమనార్హం. 
ధరణికి టెక్నికల్ సమస్యలే మెండు

అయితే డిటలైజేషన్, ధరణి పోర్టల్ కారణంగా రైతులకు రుణాల కోసం అవరసమయ్యే ధృవీకరణ పత్రాలు జారీ కావడం లేదంటున్నారు. ధరణి నమోదు ప్రక్రియ, సంబంధిత వెబ్‌సైట్ విఫలమవుతుండడంతో పహాణీ లాంటివి రైతులకు అందడం లేదు. అయితే బ్యాంకు వారు మాత్రం ఖచ్చితంగా ఈ ధృవీకరణ పత్రాలు ఉంటేనే రుణాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. కనీసం మాన్యూవల్ పహాణీ పత్రాలైన తీసుకు రావాలంటూ రైతులకు సూచిస్తున్నారు. కాగా సంబంధిత తహసీల్దార్లు మాత్రం ఈ మాన్యూవల్ పహాణీ పత్రాలను జారీ చేసేందుకు అంగీకరించడం లేదు. దీంతో సాగు పనులు మొదలై నెల రోజులు గడస్తున్నప్పటికీ ఇప్పటిక వరకు రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు. ఇప్పటికే రైతులు ఈ అంశంపై ఉన్నతాదికారులకు అలాగే ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికి ఎలాంటి ఫలితం కనిపించడం లేదంటున్నారు. ధరణి వెబ్‌సైట్‌లో వివరాలన్నీ పూర్తై ఆ వెబ్‌సైట్ అమలులోకి వచ్చిన తరువాతనే డిజిటల్ దృవీకరణ పత్రాలు జారీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే రైతుల ఆర్థిక సమస్య దృష్ట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment