Breaking News

05/07/2019

బ్యాంకులకు 70 వేల కోట్లు


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.in)
బ్యాంకింగ్ రంగం ప్ర‌క్షాళ‌న కోసం మోదీ స‌ర్కార్ పెద్ద నిర్ణ‌యం తీసుకున్న‌ది. బ్యాంకుల పున‌రుత్తేజం కోసం సుమారు 70 వేల కోట్ల మూల‌ధ‌నాన్ని కేటాయించారు.

 బ్యాంకులకు 70 వేల కోట్లు


 ఈ విష‌యాన్ని ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల తెలిపారు. క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల ఎన్‌పీఏ ల‌క్ష కోట్ల‌కు త‌గ్గింద‌న్నారు. బ్యాంకులు, మ్యుచువ‌ల్ ఫండ్ల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల‌కు సాయం అందుతుంద‌న్నారు. ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌కు వ‌న్‌టైం క్రెడిట్ ఇవ్వ‌నున్నారు. గృహ రుణాల నియంత్ర‌ణ కోసం నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ రంగంలో రానున్న అయిదేళ్ల కోసం వంద కోట్లు కేటాయించారు. నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ ట్ర‌స్టు నుంచి పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అథారిటీని వేరు చేశారు. ఎయిర్ ఇండియాలో ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించ‌నున్నారు

No comments:

Post a Comment