Breaking News

02/07/2019

షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ శంక‌ర్‌`... జూలై 18న గ్రాండ్ రిలీజ్‌


ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. 

షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ శంక‌ర్‌`... జూలై 18న గ్రాండ్ రిలీజ్‌

మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. హీరో రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. న‌టీన‌టులు:  రామ్ నిధి అగ‌ర్వాల్‌ న‌భా న‌టేష్‌ పునీత్ ఇస్సార్‌ స‌త్య‌దేవ్‌ ఆశిష్ విద్యార్థి గెట‌ప్ శ్రీను సుధాంశు పాండే త‌దిత‌రులు 

No comments:

Post a Comment