Breaking News

02/07/2019

బాబ్లీ గేట్స్ ఓపెన్


నిజామాబాద్, జూలై 2, (way2newstv.in)
గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు  తెరవడం తో దిగువ ప్రాంతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి  గోదావరి  పరవళ్ళు తొక్కింది . ప్రాజెక్టు గేట్లను ఇవాళ కేంద్ర జలసంఘం అధికారుల సమక్షంలో ఇరు రాష్ర్టాల నీటిపారుదల శాఖ అధికారులు తెరిచారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జూలై 1వ తేదీన ప్రాజెక్టు గేట్లు తెరవాల్సి ఉంది.. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో నీరు లేదు.. 

బాబ్లీ గేట్స్ ఓపెన్
వర్షాలు లేనందున ప్రాజెక్టులో ఆశించినంత నీరు రాలేదు.. జులై 1వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు బాబ్లీ గేట్లు తెరచి ఉంచుతారు. నాలుగు నెలలపాటు ఎగువన కురిసిన వర్షం నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరనుంది.. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతోంది.. పెద్ద ఎత్తున వర్షాలు  కురిస్తే తప్ప ప్రాజెక్టులోకి భారీ వరద  నీరు వచ్చే అవకాశం లేదు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కు కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర, తెలంగాణ సాగునీటి శాఖ అధికారుల సమక్షంలో గేట్లను తెరుస్తున్నారు.మహారాష్ట్ర లో భారీవర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది.

No comments:

Post a Comment