Breaking News

10/06/2019

పడకేసిన భూ పంపిణీ పథకం


హైద్రాబాద్, జూన్ 10, (way2newstv.in)
పడకేసిన భూ పంపిణీ పథకంభూపంపిణీ పథకం పడకేసింది. దళితులకు మూడెకరాల భూమి పంచుతామన్న సీఎం కేసీఆర్ హామీ ప్రచారానికే పరిమితమైంది. తొలి ఏడాది హడావుడి చేసి సైలెంట్ అయ్యారు అధికారులు. రాష్ట్రంలో 3 లక్షల 30 వేల మంది భూమిలేని దళిత కుటుంబాలుంటే… గత ఐదేళ్లలో కేవలం 5 వేల 759 మందికే సాయం అందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భూపంపిణి పథకం అమలుకావడం లేదని దళితసంఘాలు ఆరోపిస్తున్నాయి.సామాజికంగా వెనుకబడిన దళితులను ఆదుకునేందుకు మూడెకరాల పథకం అమలు చేస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 ఆగస్టు 15 న గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. మూడెకరాల భూమి పంపిణీ పథకాన్ని భూ కొనుగోలు పథకంగా పేరు మార్చారు. ఐతే ఈ ఐదేళ్లలో కేవలం 5 వేల 759 మందికి మాత్రమే 14 వేల 618 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకోసం 633 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపింది. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు కోసం  2018-19 బడ్జెట్ లోనూ 1469 కోట్ల రూపాయలు  కేటాయించింది ప్రభుత్వం.2010 లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం దళితులు 54 లక్షలు. ఇందులో 12 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఇందులో 6 లక్షల 40 వేల కుటుంబాలకు ఎకరం నుంచి 5 ఎకరాల భూమి వుంది. 


పడకేసిన భూ పంపిణీ పథకం
50 వేల దళిత కుటుంబాలకు 5 ఎకరాలకు పైగానే భూమి ఉన్నట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అసలు గజం కూడా వ్యవసాయ భూమి లేని దళిత కుటుంబాలు 3 లక్షల 30 వేలు. ఇందులో 2019,  మార్చి వరకు  కేవలం 5 వేల 759 మంది దళిత కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం భూ పంపిణీ చేసింది. అంటే భూమి లేని దళిత కుటుంబాల్లో కేవలం 1.75 శాతం మందికి మాత్రమే ఐదేళ్లలో లబ్ది కల్గింది. మూడెకరాల భూపథకాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.2016 -17, 2017-18  ఆర్థిక సంవత్సరాల్లో చాలా జిల్లాల్లో ఈ పథకం అమలే కాలేదు. ప్రైవేటు వ్యక్తులెవరు భూములు అమ్మకపోవడమే ఇందుకు కారణమంటున్నారు అధికారులు. ప్రభుత్వం 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకే ఎకరా భూమి కొనేందుకు ప్రయత్నించడమే కారణమని తెలుస్తోంది. సర్కార్ నిర్లక్ష్యం వల్లే భూపంపిణీ పథకం అమలు సరిగా లేదనే ఆరోపణలున్నాయి. ఎకరానికి 7 లక్షలే కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంతో భూమి కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కింది స్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం స్పందించండం లేదని చెబుతున్నారు.మూడెకరాల భూమి పంపిణీ చేసిన తర్వాత పంట సాగుచేసుకునేందుకు సహయ సహకారాలు ప్రభుత్వం అందించాలి. నీటి వసతి కల్పించాలి. కానీ దళితులకు పంపిణీ చేసిన భూముల సాగుపై ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి

No comments:

Post a Comment