Breaking News

10/06/2019

పడిపోతున్న భూగర్భ జలాలు


కరీంనగర్, జూన్ 10 (way2newstv.in)
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముందెన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.. నగరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడింది.. పోటీ పడి బోర్లు వేస్తుండటంతో పాతాళానికి నీళ్లు చేరాయి.. ఫలితంగా వెయ్యి అడుగులు వేసినా చుక్క నీరు రాని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. వెయ్యి అడుగులు తవ్వినా.. ఇళ్లల్లో ఉన్న బోరుబావులు పనిచేయకపోవడం, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారంతా కొత్తగా బోర్లు వేస్తున్నారు. కాలనీల్లో పోటీ పడి బోర్లు తవ్వడం ప్రారంభించారు. దీంతో భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్తున్నాయి. గతంలో 100 అడుగుల నుంచి 200 అడుగుల వరకు బోర్లు వేయగా పుష్కలమైన నీరు వచ్చేది. ఇప్పటికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 70 అడుగులకే బోర్లలో నీరు వస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో 500 అడుగులు దాటినా చుక్క నీరు రావడం లేదు. విద్యానగర్‌, చైతన్యపురి, గణేశ్‌నగర్‌, భాగ్యనగర్‌, రాంనగర్‌, మంకమ్మతోట, భగత్‌నగర్‌, కట్టరాంపూర్‌, బ్యాంకుకాలనీ  ప్రాంతాల్లో 600 నుంచి వెయ్యి అడుగులు వేస్తే తప్ప నీళ్లు రావడం లేదు.కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో దిగువ మానేరు జలాశయం ఉండటంతో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. 


పడిపోతున్న  భూగర్భ జలాలు
ఇతర అవసరాలకు వాడుకునే నీటికి మాత్రం కటకట ఏర్పడింది. అత్యధిక శాతం ప్రజలు బల్దియా నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటుండగా.. కొన్ని ప్రాంతాల్లో బోరు బావులను ఉపయోగించి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. రెండేళ్లుగా వర్షాలు కురియకపోవడం.. సమీప గ్రామాల్లోని చెరువులు ఎండిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో నీటి అవసరాల కోసం మిగతా2లో..నగరంలో ఎడాపెడా బోర్లు వేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల్లో నీటి సమస్యలు తీవ్రమయ్యాయి. ఫిబ్రవరి నుంచే పలు కాలనీల్లో బోర్లు, బావులు ఎండిపోయాయి. తర్వాత ముదిరిన ఎండలతో మరిన్ని బోర్లు నోర్లు తెరిచాయి. కొద్దిపాటి నీళ్లున్న బావులు, బోర్లు సైతం పని చేయకుండా మారడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది వేసవి తీవ్రతతో నీటి అవసరాలు మరింత పెరిగిపోయాయి. ఓ వైపు బోర్లు ఎండిపోగా.. మరోవైపు బల్దియా అందించే నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఒక కుటుంబానికి తాగునీటి అవసరాలకు నీటి సరఫరా చేస్తుండగా అన్ని అవసరాలకు సరిపోవడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.బోర్లలో నీరు లేకపోవడం, కొత్తగా బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో ఇళ్లలో నీటి సమస్యతో ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. సమీపంలో కొత్తగా బోర్లు వేస్తుండటం, కనీసం 600 అడుగులకు తగ్గకుండా లోతుల్లో వేస్తుండటంతో 200 అడుగుల లోపు ఉన్న పాత బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇతర అవసరాలకు నీటి కటకట ఏర్పడి ఖాళీ చేసి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఎగువ ప్రాంతాల్లోని పలు ఇళ్లు, బహుళ అంతస్థుల్లో ప్లాట్లు ఖాళీగా మారిపోతున్నాయి

No comments:

Post a Comment