Breaking News

05/06/2019

సాధారణ వర్షపాతమే

హైద్రాబాద్, జూన్ 5 (way2newstv.in)

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే వారం రోజులు ఆలస్యంగా జూన్ 6న లేదా 7న దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలే నమోదవుతాయని చెప్పారు. దేశ దీర్ఘకాల సగటులో 96 శాతం (5% అటూ ఇటూ) వర్షపాతం నమోదవ్వొచ్చని పేర్కొన్నారు. జూన్‌లో కొంచెం తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపారు.


సాధారణ వర్షపాతమే
రెండో పర్యాయం కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ మంత్రిగా హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరభారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వడగాడ్పులు వచ్చే రెండ్రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, అయితే నైరుతి రుతుపవనాల రాకకు మునుపు మరోసారి వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు వాతావరణాన్ని పర్యవేక్షించే ఎల్‌డొరాడో వెబ్‌సైట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన 15 ప్రాంతాల్లో 11 భారత్‌కు చెందినవే. ఈ జాబితాలో రాజస్థాన్‌లోని చురూ అగ్రస్థానంలో ఉంది. చురూలో 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోనూ ఎండలు మండిపోతున్నాయి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

No comments:

Post a Comment