Breaking News

07/06/2019

శ్రీమఠానికే శఠగోపం


సీఆర్వో కార్యాలయం సిబ్బంది చేతివాటం
33 గదుల అద్దెలు స్వాహా
లక్షల్లో శ్రీమఠం ఆదాయానికి గండి
పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం
మంత్రాలయంజూన్ 07 (way2newstv.in
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో ? వడ్డించే వాడు మనవాడు అయినప్పుడు ఏ పంక్తిలో కూర్చుంటే ఏముంది అనే సామెతను శ్రీ మఠం సిబ్బంది బాగా వంటబట్టించుకున్నట్టు ఉన్నారు. పై అధికారి ఆశీస్సులు ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుందని  సీఆర్వో కార్యాలయం సిబ్బంది ఏకంగా శ్రీ మఠానికే  శఠగోపం పెట్టి లక్షల్లో ఆదాయాన్ని కొల్లకొట్టారని మంత్రాలయం వాసులు కోడై కూస్తున్నట్టు సమాచారం.అద్దెల రూపంలో వస్తున్న లక్షలాది రూపాయలను  వాటాలు వేసుకుని మరీ పంచుకొని తిన్నట్టు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం శ్రీమఠం మేనేజర్ ఎస్ కె.శ్రీనివాసరావు పీఠాధిపతి ఆదేశాల మేరకు శ్రీమఠం అతిథి గృహాల తనీఖీలుచేశారు.తనిఖీల్లో  కళ్ళు బైర్లుకమ్మె వాస్తవాలు   బయటపడ్డాట్టు సిబ్బంది చర్చించుకుంటున్నారట. సమాచారం.సి ఆర్ ఓ కార్యాలయంలో దాదాపుగా 33 గదులకు సంబంధించిన తాళాలు మాయమైనట్టు గుర్తించారు. నాలుగు నెలలుగా తాళాలు కనిపించడం లేదని మేనేజర్ కు సిబ్బంది  చెప్పినట్టు సమాచారం అంటే ముప్పై మూడు గదులు  ఒక్కొక్క గది 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు అద్దెలు ఉంటుంది. 

 

శ్రీమఠానికే శఠగోపం
ఏసీ గదులైతే  పదకొండు వందల రూపాయల నుంచి 13 వందల రూపాయల వరకు ఉంటుంది. సీఆర్వో కార్యాలయం సిబ్బంది 33 గదుల తాళాలను నాలుగు నెలలుగా కనిపించకుండా మాయం చేసి తమ తమ దగ్గర ఉంచుకొని వచ్చిన భక్తులకు రూములు లేవు అని చెప్పేసి  సొంత వ్యాపారం మొదలు పెట్టినట్లు సమాచారం. అంటే ఒక గది సాధారణంగా 300 రూపాయలు అద్దె అనుకుంటే కూడా 33 గదులకు రోజుకు 9 వేల 900 రూపాయలు అంటే నెలకు రెండు లక్షల 97 వేల రూపాయలు నాలుగు నెలలకు గాను దాదాపు 11 లక్షల 88 వేల రూపాయలు అద్దె రూపంలో శ్రీ మఠానికిని చెల్లించకుండా వంతుల వారీగా వాటాలు వేసుకుని మరీ దోచుకుతిన్నారని మంత్రాలయం లో చర్చించుకుంటున్నారట . శ్రీమఠం  ఆదాయాన్ని  దాదాపుగా 12 లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు అనధికారికంగా సంపాదించుకున్న డబ్బులు ఎవరెవరి ఖాతాల్లోకి ఎంతెంత మొత్తంలో నగదు చేతులు మారిందో ?  ఈ గదుల  కుంభకోణంలో ఎంతమందికి పాత్ర ఉందో  ? నాలుగు నెలలుగా తాళాలు కనిపించకుండా పోతే కూడా సీఆర్వో కార్యాలయం అధికారి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉన్నాడో ?  లేక ఆయనకు తెలిసే ఈ తతంగమంతా జరుగుతోందో  ? ఈ నాలుగు నెలల నుంచే లక్షల రూపాయల ఆదాయాన్ని శ్రీ మఠానికి గండి కొడుతుంటే  మళ్లీ ఇంతవరకు బయటికి రానటువంటి విషయాలు ఎన్నో ? గురువారం, ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులు ఉన్నా లేకపోయినా శ్రీ మఠం గదులన్నీ హౌస్ ఫుల్ బోర్డులు తగిలించి భక్తులకు ఏకంగా భక్తులకు శఠగోపం పెడుతున్నారు కార్యాలయ సిబ్బంది . శ్రీమఠం గదులలో  కొన్ని మాత్తమే భక్తులకు కేటాయించింటారు.సగానికి సగం గదులు కాళీగాఉంటాయి. కానీ హౌస్ ఫుల్ బోర్డులు ఉంటాయి.  అంటే  గదులకు సంబంధించిన కొన్ని తాళాలను  సిబ్బంది  చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు 30 నుంచి 50 వరకు గదులకు తాళాలు తమ వద్ద ఉంచుకొని భక్తులకు అధిక సంఖ్యలో వచ్చి నపుడు గదులు కాళీ లేవని చెప్పి ,అధిక ధరలలో భక్తులకు అద్దెలకు ఇస్తూ  వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు శ్రీమఠంలో  మంత్రాలయంలో బహిరంగంగా చర్చించుకుంటున్నారట . నెలకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా శ్రీ మఠం ఆదాయానికి గండి పడడం నాలుగు నెలలకు గాను దాదాపు 12 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం శ్రీ మఠానికి చెందకుండా  చేయటం పట్ల  సంబందిత సిబ్బందిపై పీఠాధిఫతులు శ్రీసుబూదేంధ్ర తీర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

No comments:

Post a Comment