Breaking News

07/06/2019

ప్రజాస్వామ్యన్నీ కూని చేస్తున్న కేసీఆర్


 సీఎల్పీ ని విలీనం అప్రజాస్వామికం 
- డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్                                    
చిన్నకోడూరు, జూన్ 07 (way2newstv.in
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని,  విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులు చేస్తూ టిఆర్ఎస్ రాష్ట్రంలో రాజకీయ వ్యబిచారం చేస్తుందాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ అన్నారు.   శుక్రవారం  ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ దిగజారుడు రాజకీయాలను  చేస్తూ అప్రజాస్వామికంగా కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లగా కొనుగోలు చేయడం సిగ్గుచేటు అన్నారు.


 ప్రజాస్వామ్యన్నీ కూని చేస్తున్న కేసీఆర్
అసెంబ్లీలో తగినంత బలం ఉండగా ఇతర పార్టీ ఎమ్మెల్యే లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో కాస్తా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.కేసీఆర్, తన కుటంబం చేస్తున్న రాక్షకపాలనను,అవినీతిని,అన్యాయన్నీ ప్రశ్నిస్తారని ప్రశ్నించే గొంతు లేకుండా చేసేందుకే ఈ ఎమ్మెల్యే ల కొనుగోన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు  ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ,విద్యార్థులు  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విచ్చలవిడి తనన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన బుద్ధిచెపుతారన్నారు.సీఎల్పీ ని విలీనం చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొర్రీ శంకర్,మండల ప్రధాన కార్యదర్శి మీసం మహేందర్,ఉపాధ్యక్షుడు శనాగొండ రాజు,మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు పర్శరాం , నాయకులు ఉడుత ఎల్లం,శేఖర్,కనకయ్య తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment