Breaking News

07/06/2019

స్పీకర్ గా తమ్మినేని


విజయవాడ, జూన్ 7, (way2newstv.in)
ఏపీలో కేబినెట్ విస్తరణకు కసరత్తు జరుగుతోంది. శుక్రవారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేబినెట్ కూర్పుపై చర్చించారు. మంత్రివర్గంలో ఎవరెవరికి బెర్త్ ఖాయమయ్యిందో దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 25మంది మంత్రులతో కేబినెట్ ఉండే అవకాశ ముంది.. వీరిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండే ఛాన్స్ ఉంది. శుక్రవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. ఇప్పటికే వారికి సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది.మంత్రివర్గం సంగతి అటుంచితే.. అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. 


స్పీకర్ గా తమ్మినేని
పార్టీలో సీనియర్లకు పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ్మినేని సీతారాం కూడా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయనకు స్పీకర్ పదవి ఖాయమయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో సీనియర్ నేత కావడం.. మంచి వాక్చాతుర్యం ఉండటం.. సౌమ్యుడు కావడంతో జగన్ ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అందరిని కలుపుకొనిపోయే మనస్తత్వం ఉండటం కూడా తమ్మినేనిని ఎంపిక చేయడానికి కారణమంటున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు

No comments:

Post a Comment