Breaking News

23/01/2020

వైస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ లబ్ధిదారులకు లేఖలు అందజేత

తుగ్గలి జనవరి 23  (way2newstv.in)
మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక వ్యవసాయ కార్యాలయం నందు గ్రామ వ్యవసాయ సహాయకులు వైస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కు లబ్ధిదారులైన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు రాసిన లేఖలను అందజేశారు.
వైస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ లబ్ధిదారులకు లేఖలు అందజేత

ఈ లేఖలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన వైస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాలో విడతల వారీగా జమ చేసిన సొమ్ము వివరాలను తెలియజేసారు.రైతు భరోసా ద్వారా 13500రూ జమ అయిన రైతులకు వ్యవసాయ అధికారులు రసీదు ను అందజేస్తారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ జిలాన్ భాష,ఎంపిఈఓ స్రవంతి,వాలేంటీర్ లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment