Breaking News

31/01/2020

జేడీ అసహనం వెనుక...

హైద్రాబాద్, జనవరి 31, (way2newstv.in)
జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు స్వతంత్రుడయారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తొలుత సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారని కూడా వదంతులు పుట్టాయి.అయితే జేడీ లక్ష్మీనారాయణ ఊహించని విధంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన గత ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ గట్టి పోటీ ఇచ్చారు. కానీ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 
జేడీ అసహనం వెనుక...

ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన కనపడటం లేదు. గత రెండు, మూడు నెలల నుంచే జేడీ జనసేనను వీడతారని ప్రచారం జరుగుతోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జేడీ లక్ష్మీనారాయణను పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీతో జనసేన పొత్తు విషయంలోనూ పవన్ కల్యాణ‌ జేడీ లక్ష్మీనారాయణ సంప్రదించలేదు. దీంతో జేడీలో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. జనసేన, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో ఇక వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం దక్కే అవకాశం లేదు. ఆ సీటు బీజేపీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీని వీడారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్.ఇదిలా ఉండగా జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఇక జేడీకి మిగిలన ఏకైక ఆప్షన్ టీడీపీ ఒక్కటే. విశాఖపట్నం ఎంపీ సీటు టీడీపీలోనే జేడీ లక్ష్మీనారాయణకు దొరికే అవకాశముంది. మిగిలిన పార్టీల్లో అది సాధ్యం కాదు. అందుకే జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారంటున్నారు. మొత్తం మీద జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసి పవన్ కల్యాణ‌్ కు షాక్ ఇచ్చారు. పసుపు కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు.

No comments:

Post a Comment