Breaking News

10/06/2019

మారుతున్న సర్కారీ స్కూళ్లు...

నిజమాబాద్, జూన్ 10, (way2newstv.in)

ప్రభుత్వ స్కూళ్లు మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యంశాలు బోధించే ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యత కలిగిన వారు. ఉన్నత విద్యనభ్యసించి డీఎస్సీ ద్వారా ఎంపికైన నిపుణులున్నారు. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి బీఈడి, డీఈడీ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించి శిక్షణ పూర్తి చేసుకున్నవారు కోకొల్లలు.ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలో పదుల సంఖ్యలో పోస్టులుంటే వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. ఆ పోటీని తట్టుకుని అంతిమంగా విజేతలుగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన వారుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివిస్తే అన్నీ సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను పిల్లలు అభ్యసించగలిగే అవకాశాలున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో బీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయులున్నా ప్రభుత్వ పాఠశాలల కంటే మెరుగైన వారు కారు. 


మారుతున్న సర్కారీ స్కూళ్లు...
నియామక పరీక్షలో వడపోత ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య పిల్లలకు అందే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రైవేటు మోజులో తల్లిదండ్రులు వేలాది రూపాయల డబ్బులను ఖర్చు చేస్తున్నారు.ఉభయ జిల్లాల్లో మొత్తం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1573, ప్రాథమికోన్నత పాఠశాలలు 265, ఉన్నత పాఠశాలలు 461 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 10వేలకు పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రైవేటు బోధనకు సంబంధించి ప్రాథమిక 269, ప్రాథమికోన్నత 289, ఉన్నత 251, మొత్తం 819 పాఠశాలలున్నాయి. 4 వేల మంది బోధన చేస్తున్నారు. విద్యాబోధన పరంగా విద్యార్థులకు నిపుణుల పాఠాలు, మౌలిక వసతులు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో సింహ భాగం ప్రైవేటు వైపే మొగ్గుచూపుతన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి.  చదువుకునే బదులు చదువు‘కొనే’ రోజులు వచ్చాయి. చదువుల ఫీజులు తలకు మించిన భారమవుతున్నా పిల్లల బాగోగులకు తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. కేజీ నుంచి పదో తరగతి వరకు చదువులు వేలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోజుల్లో కాన్వెంట్‌ చదువులకే వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. రుసుముల భారం అంతా ఇంతా కాదు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగ ప్రవేశం చేశాక విద్యావిధానం రూపురేఖలు మారాయి. తల్లిదండ్రులు కార్పొరేట్‌ చదువంటే స్థాయిగా, ప్రభుత్వ పాఠశాలలంటే చులనకగా భావిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా అప్పులు చేసి తమ పిల్లలను చదివిస్తున్నారు.

No comments:

Post a Comment