Breaking News

07/06/2019

8న సొంతూరుకు కిషన్ రెడ్డి


రంగారెడ్డి, జూన్ 7, (way2newstv.in)
వారసత్వ రాజకీయాలు లేవు. పూర్వీకులు సంపాదించిన ఆస్తి, పాస్తులు లేవు. కేవలం ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటమే పార్లమెంట్కు పంపించింది. కేంద్రమంత్రి పదవి వరించలే చేసేంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, రాజకీయ ఓనమాలు నేర్చుకొంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగాపురం కిషన్రెడ్డిది సాధారణ కుటుంబ నేపథ్యం. సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరిన కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్గ్రామంలో స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు 1964 మే15న కిషన్రెడ్డి జన్మించారు.


8న సొంతూరుకు కిషన్ రెడ్డి
1977లో జనతా పార్టీ కార్యకర్తగా చేరాడు.1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత యువమోర్చా రంగారెడ్డి కమిటీ కన్వీనర్గా క్రియాశీలకంగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ1986లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.జాతీయ ప్రధానకార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ స్థాయిల్లో పనిచేసి 2002లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో రాష్ట్ర, జాతీయ స్థాయి బాధ్యతలు చేపట్టి 2010లో రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పటిష్ఠతకు కృషి చేశారు. 2004 లో హిమాయత్ నగర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్పేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శాసనసభా పక్షనేతగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి అతితక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019లోని పార్లమెంట్ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా 60 వేలకు పైగా మెజారిటీ సాధించి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు కిషన్రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా  ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జూన్8న కిషన్ రెడ్డి స్వగ్రామానికి రానున్నారు

No comments:

Post a Comment