Breaking News

15/05/2019

రైతులకు అవగాహన సదస్సు

చెన్నూర్ మే 15 (way2newstv.in)   
మంచిర్యాల  జిల్లా  మండలంలోని అక్కెపెల్లి  గ్రామంలో బుధవారం రోజున మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎం. రాజశేఖర్ రైతులకు నకిలీ విత్తనాలు వాడడం వల్ల కలిగే అనర్థాల గురించి  అలాగే వేసవిలో పంట పొలాలను ఎలా దున్నుకోవాలి వ్యవసాయ సంరక్షణ చర్యల గురించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. 


రైతులకు అవగాహన సదస్సు

రైతులు ఎరువులు, విత్తనాలు పురుగు,మందులు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ కలిగిన  డీలర్ వద్ద కొనుగోలు చేయాలని డీలర్ వద్దనుండి  కొనుగోలు రసీదు తీసుకోవాలని సూచించారు . అలాగే  రైతు జీవిత బీమా , పంట భీమా, తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు

No comments:

Post a comment