Breaking News

16/05/2019

ఖాజానా ఖాళీ (విజయనగరం)

విజయనగరం, మే 16(way2newstv.com): 
గ్రామాల్లో అభివృద్ధి పనులు, ఇతర సాధారణ వ్యవహారాలు సాగాలంటే నిధులుండాలి.. అన్నీ ఉంటేనే పనులు జరగడం కష్టం.. అలాంటిది డబ్బుల్లేక పంచాయతీల్లో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే విజయనగరం మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పారిశుద్ధ్యం పనులూ సాగడం లేదు. ఇప్పటివరకు పనులు నిలిచిపోకుండా.. తాగునీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా మండల పరిషత్తు, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇతర ఖాతాల్లోని డబ్బులును వీటికి మళ్లించి నెట్టుకొచ్చారు. ప్రస్తుతం పంచాయతీలు, మండల పరిషత్తు, 14వ ఆర్థిక సంఘం ఇలా ఏ ఖాతాల్లోనూ డబ్బులు లేవు. పీడీ ఖాతాల్లో నిధులు సున్నాగా చూపిస్తుడడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. అభివృద్ధి పనులు సరే.. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాకు ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలియక సతమతమవుతున్నారు. రెండు నెలలు కిందట సుమారు రూ.23 లక్షల బిల్లులను ఆన్‌లైన్‌లో అధికారులు సమర్పించారు. 


ఖాజానా ఖాళీ (విజయనగరం)

ప్రస్తుతం మరో రూ.20 లక్షల బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. జొన్నవలసలో ఇంటింటికి కుళాయి పథకానికి సంబంధించి సుమారు రూ.6 లక్షల బిల్లులు నిలిచిపోవడంతో పైపులైను పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. మంచినీటి పథకాల పంపు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు అరకొరగానే సేవలందిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో అధికారులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నామమాత్రంగానే కొనసాగుతున్నాయే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో 15 పంచాయతీల్లో సుమారు రూ.4 కోట్లు నిధులు అందుబాటులో ఉండేవి. గతంలో ఎన్నడు లేని విధంగా పైసా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో పాలన ఎలా చేయాలో పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీ, ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలకు అర్థం కావట్లేదు. నేటి వరకు మాట గుర్తింపుపై ప్రజలకు అందించాల్సిన సేవలపై పనులు కొనసాగించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలకు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు పూర్తిగా నిలిచిపోయి పాలన ఆగమ్యగోచరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.విజయనగరం మండలంలో అన్ని పంచాయతీలు విద్యుత్తు శాఖకు సుమారు రూ.40 లక్షల చెల్లించాలి. పంచాయతీల్లో నీరు, పారిశుద్ధ్యంకే డబ్బులు లేని పరిస్థితుల్లో ఇప్పట్లో ఈ బిల్లులు చెల్లించే పరిస్థితి కనిపించట్లేదు. విద్యుత్తు శాఖ దయమీదే పంచాయతీల్లో కాంతులు ఆధారపడి ఉన్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపివేస్తే గ్రామాలు అంధకారంగా మారుతాయి. ఆర్థిక శాఖ పీడీ ఖాతాల్లో డబ్బులు జమచేసి, గ్రామ పంచాయతీ బిల్లులకు ఆమోదం తెలిపాలని ఖజానా శాఖకు ఆదేశాలు జారీ చేస్తే గ్రామాల్లో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment