Breaking News

16/05/2019

స్మార్ట్ సర్టిఫికెట్ల కొరతతో ఇబ్బందులు

హైద్రాబాద్,  మే 16, (way2newstv.in)
కొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్‌సీ) స్మార్ట్‌కార్టులు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో పదేపదే ఇదే సమస్య ఉత్పన్నమవుతున్నది. నగరంలో ఒక్కో రోజు సుమారుగా 1500 నుంచి 2 వేల వరకు స్మార్ట్‌కార్డులు గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్‌టీవో పరిధిలో వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కారు ్డ లను ప్రతీ కార్యాల యం జారీచేయాల్సి ఉంటుంది. పదేపదే ఇటువంటి సమస్య తలెత్తుతున్నప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో అధికారు లు విఫలమవుతున్నారు. 


స్మార్ట్ సర్టిఫికెట్ల కొరతతో ఇబ్బందులు

రవాణాశాఖ సేవల్లో సులభతరం కావాలని ప్రభుత్వం అన్ని సేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చినప్పటికీ కేవలం ఆర్‌సీ కోసం చెప్పులరిగేలా తిరుగాల్సిన పరిస్థితి వస్తున్నది. స్మార్ట్‌కార్డుల కోసం వాహనదారులు ఫీజులు చెల్లించినప్పటికీ కార్డులను అందచేయడంలో ఉన్నతాధికారులు ఆసక్తి కనబరుచకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఆర్‌సీ కార్డులు లేకపోవడంతో ఆర్‌టీవో స్థాయి అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. సమాధానం ఇవ్వలేక ఆర్‌టీవోలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ప్రతీసారి ఉద్భవిస్తున్నప్పటికీ సమస్య తలెత్తకుండా చేయడంలో ఉన్నతాధికారులు విఫలమవుతూనే ఉన్నారు. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో ముగ్గు రు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌లు ఉన్నప్పటికీ ఈ సమ స్య పట్ల చిత్తశుద్ధి చూపెట్టడం లేదు. ప్రభుత్వంతో సమన్వయం చేసి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ పట్టించు కోవడం లేదు. కార్డులుసమకూర్చుకుంటే రిబ్బన్ల సమస్య, రిబ్బన్లు, స్మార్ట్‌కార్డులు సిద్ధమైతే ప్రింటింగ్ మెషిన్ సమస్య ఇలా ఏదో ఒకటి కొనసాగుతూనే ఉంది. ముగ్గురు జేటీసీల్లో అనుభవం ఉన్న జేటీసీ హైదరాబాద్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం జూనియర్ జేటీసీలు ఉన్నత స్థా నంలో కీలకపోస్టు ల్లో ఉండటం కూడా సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణమవుతున్నది.

No comments:

Post a Comment