Breaking News

16/05/2019

ట్రెండ్స్ కు తగ్గట్టు అక్వేరియం

వరంగల్,  16, (way2newstv.in)
మారుతున్న ట్రెండ్స్ కు తగ్గట్టుగా అక్వేరియం ల వాడుక ఫ్యాషన్ గా మారింది. చూడగానే ఆకట్టుకునే విధంగా అనేక రకాల చేపలు అందుభాటులో ఉన్నాయి. ఇళ్లలోనే కాదు వివిధ రకాల షోరూంలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు వంటి వాటికి కూడ అదనపు ఆకర్షణ చేకూర్చేలా యజమానులు అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు ధనికులకే అందుబాటులో ఉన్న అక్వేరియంలు నేడు సామాన్యులు సైతం తమ ఇంటిలో అలంకరణ కోసం ఉపయోగిస్తున్నారు. ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వివిధ రకాల డిజైన్లతో ఇంటిని అలంకరించడం జిల్లాలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఆసక్తికి అనుగుణంగా నిర్మాణాలు చేసుకుంటున్న ఇళ్లలో అదనపు ఆకర్షణ, ఆహ్లాదం కోసం అక్వేరియంలను ఏర్పాటు చేసుకోవడం పలువురికి ఆసక్తిగా మారిందిఇందులో 150 రకాల చేపలు ఉండగా గోల్డ్‌పిష్‌, ఏంజిల్‌, బ్లాక్‌మోర్‌, ఆల్‌ కలర్స్‌ మోలిస్‌, బి.కె.గోల్డ్‌, బ్లాక్‌ మోర్‌ గోల్డ్‌, రెడ్‌ షోటెల్‌, బ్లూ డానియో, పెన్సిల్‌ పిష్‌, ప్రెటక్‌ ఫిష్‌, కొయికార్క్‌, షార్క్‌, ఆల్‌బిన్‌ షార్క్‌, టెండిల్‌భార్‌, ఎవరామ్స్‌, విడియోటెట్రాచ టైగర్‌బార్‌, రూకిన్‌గోల్డ్‌, క్యాలిక్‌గోల్డ్‌, సి ఏంజీల్‌, అర్యానా లాంటి రకాలు ఉన్నాయి. 


ట్రెండ్స్ కు తగ్గట్టు అక్వేరియం

ఇవే కాకుండా రెడ్‌ ప్యారట్, బ్లూ ప్యారట్‌, గ్రీన్‌ ప్యారట్‌, ఆల్‌బిన్‌ ఆస్కో, రెడ్‌ ఆస్కాబ్‌ లాంటి విదేశీ చేపలు విపణిలో లభిస్తున్నాయి. చైనా దేశంలో వాస్తు కోసం ఉపయోగించే ఆరువానా, ప్లవర్‌ఆర్మ్‌ రకానికి చెందిన చేపలు అందుబాటులో ఉన్నాయి. ఆయా రకాలను బట్టి దేశంలో ఉత్పత్తి అయ్యే చేప పిల్లల ధర రూ.10 నుంచి వేయ్యి వరకు, చైనా, జపాన్‌ ఇతర దేశాలకు చెందిన చేపపిల్లలు రూ.1500ల నుంచి రూ.3వేల వరకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. చేప పిల్లలకు నిత్యం ఒకటి లేదా రెండు సార్లు దాణా వేయాల్సి ఉంటుంది. అక్వేరియంలో నీటిని వారం నుంచి నెల రోజుల వరకు ఉంచవచ్చు. ఇందులో బోరు, మినరల్‌ వాటర్‌ను నేరుగా ఉపయోగించడానికి అవకాశం ఉన్న నల్లాల ద్వారా మాత్రం నాలుగు రోజులు నిల్వ ఉంచిన తర్వాత ఉపయోగించాలి. నీటిని మార్చినపుడు వాటికి కావాల్సిన మందులను అందులో వేయాలి.అలంకరణ కోసమే అక్వేరియంల ఏర్పాటు గాకుండా ఇళ్లలోని పెద్దలు, పిల్లలు వారి అభిరుచులకు అనుగుణంగా అక్వేరియంలను ఏర్పాటు చేసుకునేందుకు అమితాసక్తి చూపుతున్నారు. పిల్లలకు ఆసక్తి పెరిగింది. అయితే మార్కెట్లో కూడా వారి అభిరుచులకు అనుగుణంగా లభిస్తుండటంతో వాటికి ఆదరణ పెరిగింది. అకర్షణ, కొత్త అందం కోసం కొందరు, వాస్తు కోసం మరికొందరు, అభిరుచికి తగ్గట్లుగా మరికొందరు అక్వేరియంలను ఎంపిక చేసుకుంటున్నారు. అక్వేరియం డిజైన్‌లు కూడా విభిన్న రకాలుగా రావడంతో ఆకర్షిస్తున్నాయి. వివిధ రకాల చేపలు కూడా అందుబాటులో దొరుకుతున్నాయి. చిన్నారులు ఓ లాంటివి, పెద్దలు మరో లాంటి చేపలను అక్వేరియాల్లో ఏర్పాటు చేసుకుంటూ వాటిని ఇంట్లో అమర్చుకుని తీరిక సమయాల్లో ఆహ్లాదం పొందడం అలవాటుగా మారింది.  పచ్చని చెట్లు, రంగురంగుల కర్టెన్లు, ఫర్నిచర్‌కు తోడు 
అక్వేరియంల ప్రాధాన్యం పెరుగుతోంది. రంగురంగుల చేప పిల్లలను చూస్తే మనస్సు ఉల్లాసంగా ఉంటుందని, చేపలు ఇంట్లో ఉంటే మత్స్య యంత్రం ఇంట్లో ఉన్నట్లేనని మరికొందరు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం అక్వేరియాలలో నూతన డిజైన్లు వచ్చాయి. బౌల్స్‌ మాడల్‌, ఇంటి ఆకృతి, అల్మారా ఇలా మన అభిరుచులకు అనుగుణంగా అందుభాటులో ఉన్నాయి. ఇందులో భౌల్‌ (పిష్‌పాట్‌) రూ.150 నుంచి రూ.500ల వరకు, అక్వేరియంలు సైజును బట్టి రూ.వెయ్యి నుంచి రూ.25 వేలు వరకు ఉండగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అక్వేరియం రూ.2500ల నుంచి రూ.30వేల వరకు మార్కేట్‌లో లభిస్తున్నాయి. అక్వేరియంల తయారికి కావలసిన మొక్కలు, ఆకర్షించడానికి ఉపయోగించే రంగురాళ్లు, ఇతర వస్తువులు చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment