నల్లగొండ, మే 13, (way2newstv.in)
సర్కారీ దవాఖానల పని తీరుపై రోగుల నుంచే నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ తరహాలో రోగికి ఫోన్ జేసి ఆరోగ్యంపై వాకబు చేయాలని, ఆస్పత్రిలో అందిన సేవలపై ఆరా తీయాలని భావిస్తున్నారు. రోగుల నుంచి కంప్లైంట్స్ తీసుకునేందుకు మూలనపడిన టోల్ ఫ్రీ నంబర్, గ్రీవెన్స్ సెల్‌ను పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే దవాఖానలకు వచ్చే ప్రతి రోగి నుంచి ఫోన్ నంబర్ తీసుకోవాలని సూపరింటెండెంట్లను హెల్త్ డిపార్ట్ మెంట్ పెద్దాఫీసర్లు ఆదేశించారు. ఈ నెల మొదటివారం నుంచే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 110 హాస్పిటల్స్ లో రోగుల నుంచి మొబైల్ నంబర్‌తో పాటు, అడ్రస్ కోసం ఆధార్ కార్డు వివరాలు తీసుకుంటున్నారు.ఇలా ప్రతి రోగికి ఫోన్ చేసేందుకు, ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం సర్కారీ హాస్పిటల్స్ లో సమస్యలపై కంప్లైంట్ చేయడానికి (040–39565339) టోల్ ఫ్రీ నంబర్, గ్రీవెన్స్ సెల్ ఉన్నాయి. కానీ ఈ సదుపాయాలు ఉన్నాయన్న విషయం చాలా మంది రోగులకు తెలీదు.
సర్కార్ ఆస్పత్రుల పని తీరుపై ఫీడ్ బ్యాక్..
హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులకూ వీటిపై అవగాహన లేదు.ప్రభుత్వ దవాఖాన్లలో పన్జేసే వార్డ్ బాయ్ దగ్గర్నుంచి డాక్టర్ల వరకూ రోగులపై కస్సుబుస్సులాడేవారే తప్ప, ఏదైనా సమాచారం అడిగితే మాట సాయం చేసేవారు ఉండరు. ఓపీ ఎక్కడు చూస్తరు.. డాక్టర్ రూమ్ ఎక్కడా అని అడిగితే చెప్పేవారు అరుదు. గ్రామాల నుంచి వచ్చే రోగులు జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఏది ఎక్కడుందో తెల్వక అయోమయానికి గురవుతుంటారు. ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టేలా టీచింగ్, జిల్లా హాస్పిటల్స్ లో రిసీవింగ్, హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని హెల్త్ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. రోగి ఆస్పత్రికి రాగానే వారి జబ్బు తాలూకు వివరాలు అడిగి, ఓపీ కోసం ఎక్కడికెళ్లాలో చెప్పడంతో హెల్ప్ డెస్క్ పని మొదలవుతుంది. రోగిని పరీక్షించిన అనంతరం డాక్టర్ సూచించిన టెస్టులు చేయించుకోవడానికీ హెల్ప్ డెస్కే దారి చూపుతుంది. ఆ తర్వాత మందులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా వేసుకోవాలో కూడా వీళ్లే చెప్తారు.దవాఖానల స్టాఫే రోగికి దారి చూపేలా చేయాలని సర్కారు భావిస్తోంది. ఒకరి సాయం లేకుండా హాస్పిటల్స్ లో ఏ విభాగం ఎక్కడుందో సూచించే బోర్డులు, గోడలపై గుర్తులు వేయించేందుకు రెడీ అవుతోంది. ప్రతి రోగికీ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, అంబులెన్స్‌లోనే రోగిని గంటల కొద్ది ఉంచే పద్ధతి మానుకోవాలని మంత్రి ఈటల హాస్పిటల్స్ కు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment