Breaking News

24/05/2019

నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్


అమరావతి మే 24  (way2newstv.in)
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార అనంతరం ముందుగా ఎపి డిజిపి గా గౌతమ్ సవాంగ్ ను నియమించనుండటం దాదాపు ఖరారు అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటివరకు పదోన్నతుల విషయంలోను, బైబర్ కేషన్ కు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జగన్ పై విశాఖపట్నం లొ కోడి కత్తితో దాడి చేసిన సమయంలో కొంతమంది అధికారులు ఎటువంటి విచారణ, దర్యాప్తు జరపకుండానే మీడియా సమావేశాల్లో తలో విధంగా మాట్లాడిన అంశాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ను కోరేందుకు నూతన ఎపి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. దానితోపాటు, తుని లో రైలు విధ్వంసానికి సంబంధించి సిబిఐ దర్యాప్తునకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 



నూతన  డీజీపీగా గౌతమ్ సవాంగ్

ఇదిలా ఉండగా కొంతమంది ఉన్నత స్ధాయి పోలీసు అధికారులు దీర్ఘ కాలిక సెలవులపై వెళ్ళేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది..అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల ఓటమిని చవి చూసిన ఒక నేతపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారంట్లు లు ఉండటంతో వాటిని తక్షణ అమలుకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..అయితే ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో కొంతమంది అధికారులను అదే స్ధానాలలో కొనసాగిస్తూ వారితోనే కాగల కార్యం గంధర్వులే నిర్వహిస్తారనే తరహలో పనిచేయించాలనే కోణంలో కూడా నూతన ప్రభుత్వ నిర్ణయని విశ్వసనీయ సమాచారం. ఎపి ఇంటిలిజెన్స్, ఎపి ఎసిబి లో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోదామనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీస్ శాఖకు సంబంధించి సమూల మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎపి హోంశాఖకు అంబటి రాంబాబు, లేక చెవిరెడ్డి భాస్కర రెడ్డి లేక రోజా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఏదైనప్పటికీ వచ్చే మూడు నెలల కాలంలో పోలీస్ శాఖ భారీ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. 

No comments:

Post a Comment