Breaking News

01/05/2019

మే 26 ఉదయం 9.29 గంటలకు జగన్ ప్రమాణం ...

విజయనగరం, మే 1,  (way2newstv.in)
ఏపీ ఎన్నికల ఫలితాలకు ఇంకా 20 రోజులకు పైగా సమయం ఉంది. ఎవరు గెలుస్తారన్న విషయం ఏమో కానీ... జ్యోతిష్యులు మాత్రం ఎవరికి వారు తమ లెక్కలు వేసేస్తున్నారు. కొందరు జగన్ సీఎం అవుతారని చెబుతుంటే... మరికొందరు మత్రం చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీవిద్యా సర్వమంగళాదేవీ పీఠానికి చెందిన జ్యోతిష్యులు మురపారక కాళిదాసు శర్మ... ఒక అడుగు ముందుకేసి జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహుర్తం కూడా పెట్టేశారు. ఏపీలో జగనే ముఖ్యమంత్రి అవుతారంటున్నారు ఆయన... మే 26 ఉదయం 9.29 గంటలకు దివ్యమైన ఘడియలు ఉన్నాయని చెబుతున్నారు. 


మే 26 ఉదయం 9.29 గంటలకు జగన్ ప్రమాణం ...

ఆ సమయంలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే తిరుగుండదంటున్నారు. జగన్ జన్మనక్షత్రం రోహిణి అని. వైసీపీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల కలయికతో అద్భుతమైన ముహర్తం అని శర్మ చెబుతున్నారు.తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ గెలుస్తారని తానే ముందు చెప్పానన్నారు. దేవనాడీ కాలచక్ర గ్రహ గ్రతుల్ని అనుసరించి కచ్చితమైన జ్యోతిష్యం చెప్పమాని తెలిపారు శర్మ. అందుకే ఇప్పుడు ఏపీలో కూడా జగనే గెలుస్తారని అంటున్నారు. ఎన్నికల్లో విజయం కోసం మార్చి 27 నుంచి ఏప్రిల్ 12 వరకు నీలాపతాక సహిత రాజశ్యామల యాగం నిర్వహించామన్నారు. జగన్ చేతుల మీదుగా వరుణ ప్రధానం తీసుకొని యాగాన్ని ముగించినట్టు శర్మ వివరించారు. ఇప్పటికే చాలామంది జ్యోతిష్యులు జగనే సీఎం అవుతారంటూ చెప్పుకొచ్చారు. కానీ శర్మగారు మాత్రం సీఎంగా జగన్ ప్రమాణ స్వీకరోత్సవానికి ముహుర్తం కూడా పెట్టేశారు. మరి శర్మ గారి జ్యోతిష్యం నిజమని తేలాలంటే... మరికొన్ని రోజులు ఆగాల్సిక తప్పదు.

No comments:

Post a Comment