Breaking News

20/04/2019

మెట్రోను ఆదరిస్తున్న జనం

హైద్రాబాద్, ఏప్రిల్ 20, (way2newstv.in)
హైద్రాబాద్ నగరంలో మెట్రో మెరుపులు మెరిపిస్తోంది. ఏ కారిడార్ చూసినా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా అమీర్ పేట-మాదాపూర్ రూట్ లో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ప్రయాణం మరింత సులభతరం కావడంతో ఆ రూట్లో మెట్రో బాగా దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మెట్రోకు ముందు క్యాబ్ లతో అనేక ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్న ఉద్యోగులు మెట్రో అందుబాటులోకి రావడంతో హర్హాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మెట్రోకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. రైళ్లలో రద్దీ ఎక్కువవుతోంది. సగటున రోజూ 2.3 లక్షల మంది మెట్రోలో హాయిగా, హ్యాపీగా రైడ్ చేసేస్తున్నారు. ప్రతి వారం అదనంగా నాలుగు వేల మంది ప్యాసింజర్లు చేరుతున్నారు. ఒక్కరోజులో 2.67లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. ఐపీఎల్ మ్యాచ్ ఉండడం కూడా ప్రయాణికులు పెరగడానికి కారణమైందని తెలుస్తోంది. 


మెట్రోను ఆదరిస్తున్న జనం

దాదాపు 21 వేల మంది ప్రయాణికులు ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్లా రు. ఐటీ కారిడార్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం 12 కంపెనీలు ఇప్పటికే మెట్రో స్టేషన్ల వరకు ఫ్రీ షటిల్స్ నడుపుతున్నాయి. తాజాగా ఎల్ అండ్ టీ కూడా దుర్గంచెరువు నుంచి షటిల్ బస్సులను ప్రారంభించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాలో ఉద్యోగుల కోసం ఉచితంగా సేవలు అందిస్తోంది. 15 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటాయని మెట్రో సంస్థ తెలిపింది. ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా మెట్రో వినియోగం పెరిగిందని,ఐటీ ఉద్యోగులకూ మెట్రోనే ప్రధాన రవాణావ్యవస్థగా మారిందని సంస్థ తెలిపింది. అందుకే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పింది. మెట్రో ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు మరిన్ని సేవలను అందించాలని ఎల్‌అండ్‌టి మెట్రో నిర్ణయించింది. గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఉచిత షెటల్ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది.ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసుల వరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. తొలి దశలో దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మెట్రో రైలులో ప్రతినిత్యం రెండున్నర లక్షలకు పైగా ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. మున్ముందు మరింత మంది ప్రయాణించే అవకాశం ఉండడంతో వారికి మరింత చేరువ కావాలనేది సంస్థ ఆశయంగా కన్పిస్తున్నది.

No comments:

Post a Comment