Breaking News

23/04/2019

హెచ్‌ఐవీకి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం

తిరుపతి, ఏప్రిల్ 23, (way2newstv.in)
ప్రాణాంతకమైన హెచ్‌ఐవీకి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. హెచ్‌ఐవీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెండు  యాంటీ రెట్రోవైరల్ మందులు టెనోఫఫోవిర్, ఎఫ్‌టీసీలను కలిపి ఈ వ్యాక్సిన్‌ను తయారుచేశారు. హెచ్‌ఐవీ వైరస్ కొత్త కణాల్లోకి చొచ్చుకుపోయేందుకు ఉపయోగించే ఎంజైమ్‌ను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీఆర్‌ఈపీ వ్యాక్సిన్ హెచ్‌ఐవీ వైరస్ నుంచి 90శాతం వరకూ రక్షణ కల్పిస్తోందని వివరించారు. హెచ్‌ఐవీ వైరస్ సోకనివారు ఈ వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందవచ్చునని, ఒకసారి సోకిన 72 గంటల్లోపు పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రోఫైలాక్సిస్ మందులు నెలరోజుల పాటు వాడటం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించారు.న్యూయార్క్‌లోని రాక్‌ఫిల్టర్ యూనివరిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో పీఆర్‌ఈపీ పేరున్న వ్యాక్సిన్‌ను తీసుకుంటే ఏడాదిపాటు హెచ్‌ఐవీ వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని తేలింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ద్వారా 18వారాల వరకు రక్షణ లభిస్తోందని, ఆ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకుని కొత్త రూపాలు సంతరించుకోవడం దీనికి కారణమని శాస్త్రవ్తేతలు స్పష్టం చేశారు. అయితే కొన్ని నిర్దుష్టమైన పొటీన్లను చేర్చడం ద్వారా ఈ వ్యాక్సిన్‌ను ఏడాదిపాటు రక్షణ కల్పించేలా చేయవచ్చునని వివరింంచారు.


హెచ్‌ఐవీకి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం

హెచ్‌.ఐ.వి శరీరంలోకి ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్‌ఐవి క్రిముల కారణంగా కాకుండా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లలా బయటపడతాయి. హెచ్‌ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్‌.ఐ.వి సోకిందనే అనుమానం రాదు. దీనికి సంబంధించిన పరీక్షలను ఒకటికి రెండుసార్లు చేయించుకుని, స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు ఈ వ్యాధివే అని భావించకూడదు. ఈ క్రిములు శరీరంలోకి చేరిన తరువాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాలనుంచి నెలల వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌ అని తెలియదు. అయితే, బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింప చేయగలిగే స్థితిలో ఉంటారు. ఈ క్రిములతో పోరాడటానికి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయనారంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ అని ఫలితం వస్తుంది. ఇవి శరీరంలోకి చేరిన తరువాత తొలిదశలో కనిపించే.. ఫ్లూ వంటి లక్షణాలు తగ్గి పోయిన తరువాత బాధితులు కనీసం పదేళ్ల వరకూ ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో ఈ క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి. ఈ ఎయిడ్స్‌ దశలో పదిశాతం బరువు తగ్గిపోవటం, తరచూ విరేచనాలు కావడం, తరచూ జ్వరం రావడం ముఖ్య లక్షణాలుగా కన్పిస్తాయి.మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ సిడి4 కణాలు పోషించే పాత్ర చాలా కీలకమైంది. వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనమైందన్న విషయాన్ని సిడి4 కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు. సిడి 4 కణాలను టి-హెల్పర్‌ కణాలని కూడా అంటారు. ఆరోగ్యవంతులలో సిడి4 కణాలు ప్రతి మిల్లీ లీటర్‌ రక్తంలో 500 నుంచి 1500 వరకూ ఉంటాయి. సరైన చికిత్స తీసుకోని పక్షంలో సిడి4 కౌంట్‌ గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్‌ఐవి వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించడం మొదలౌతుంది.ఇలా సుమారు 10-15 సంవత్సరాల కాలంలో సీడీ4 కణాలు తీవ్రంగా దెబ్బతిని, వాటి సంఖ్య తగ్గిపోయి, వైరస్‌ పెరిగిపోయి, హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తి.. ఎయిడ్స్‌ దశలోకి వెళ్లిపోతారు. తొలిదశలో హెచ్‌.ఐ.వి యాంటీబాడీ పరీక్షలు చెయ్యటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్షలో ఖచ్చితమైన ఫలితం తెలియాలంటే ఆరు వారాల నుంచి ఆరు నెలల 'విండో పీరియడ్‌' కాలం ఆగాల్సి ఉంటుంది. 'పీ.సీ.ఆర్‌' పరీక్ష ద్వారా హెచ్‌ఐవి ఉనికిని ఇంకా ముందే గుర్తించవచ్చు.దీనిపై ఇప్పటికీ ఎన్నో అపోహలున్నాయి. ఇది సోకిన వ్యక్తితో, లైంగిక సంబంధం వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో, నూటికి 85 మంది లైంగిక సంబంధం ద్వారా తెచ్చుకున్న వారే. మాదక ద్రవ్యాలను తీసుకో వడానికి, మందులు వాడకంలోనూ ఒకే సిరంజిని, సూదిని ఎక్కువమంది ఉపయోగించడం, రక్తమార్పిడి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శిశువుకు హెచ్‌.ఐ.వి గల తల్లినుంచి ఈ వ్యాధి గర్భంలో ఉన్నప్పుడు కాని, జనన సమయంలో కాని వ్యాపించే అవకాశం ఉంది. శస్త్రచికిత్స పరికరాలను శుభ్రం చేయకుండా వాడితే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

No comments:

Post a Comment