హైద్రాబాద్, ఏప్రిల్ 8, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రశంసలు పొందిన పథకాలనే.. నేడు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ మేనిఫెస్టోలలో పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని మన్సురాబాద్ డివిజన్‌లో మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గడిచిన ఐదేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఏడాది జూన్ 2 వస్తే తెలంగాణ ఏర్పడి ఐదేండ్లు అవుతుంది. ఒక నాడు భారతదేశంలో పశ్చిమ బెంగాల్ గురించి చెప్పేవారు. తర్వాత గుజరాత్ మోడల్ గురించి విస్తృతంగా చర్చ జరిగేది. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఐదేళ్ల స్వల్ప కాలంలోనే దేశంలో మన రాష్ట్రం గురించి చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తరువా త ఇంటింటికీ నల్లాల ద్వారా రోజంతా తాగునీటిని అందిస్తామని.. దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు తెలిపారు.
పది రోజుల తర్వాత..ఇంటింటికి నల్లా నీరే
ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ కొంపల్లిలోని పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంక్షేమసంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు చాయ్‌పై చర్చ జరిగిందని.. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై చర్చలు జరుగుతున్నాయన్నారు.రైతుబంధును కాపీకొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమల్లోకి తెచ్చిన మోదీ అధికారంలో నుంచి దిగిపోయే ముందు మంచి పనిచేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ పాలన మోడల్‌గా మారిందని తెలిపారు. ఒకప్పుడు బెంగాల్, తదనంతరం గుజరాత్‌ను నమూనాగా చెప్పుకొనేవారని, ఇప్పు డు తెలంగాణను నమూనాగా దేశం చూడటం హర్షణీయమన్నారు. గతంలో 14 రోజులకోసారి తాగునీరు వచ్చేవని, టీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రోజు విడిచిరోజు సరఫరా చేస్తున్నదని చెప్పా రు. త్వరలోనే తెలంగాణలో ప్రతిరోజూ తాగునీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. నగరంలో కలిసిన 13మున్సిపాలిటీల్లో రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు తెలిపారు. బాచుపల్లి, జీడిమెట్ల పారిశ్రామికవాడల్లోని రసాయనాల పరిశ్రమలను త్వరలోనే ఔటర్ రింగురోడ్డు అవతలి ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరపున పోటీచేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి దొరకలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని అన్నారు. నోటుకేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి.. ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని వ్యక్తి కావాలా? విద్యావేత్త, యువకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి కావాలా..? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. కారు గుర్తుకు ఓటువేసి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment