Breaking News

09/04/2019

నేతల నాలుకకు నరం లేదా..

ఉచిత హామీలతో ఏపీ లీడర్స్
విజయవాడ, ఏప్రిల్ 9, (way2newstv.in)
ఇవ్వని హామీ లేదు… చెప్పని మాట లేదు. ఇలా సాగిపోతున్నారు. అధికార విపక్ష అధినేతలు నేను మాత్రం ఏమి తక్కువ తినలేదని బలమైన మూడోపక్షంగా రంగంలో వున్న జనసేన అధినేత ఉచిత హామీలు ఎడా పెడా ఇస్తున్నారు. దాంతో ఓటర్లు హామీల వర్షంలో తడిసి ముద్దయిపోతున్నారు. ఎపి అంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు చర్చకు దారితీస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే తిరిగి తనకే అధికారం ఇవ్వాలంటున్నారు చంద్రబాబు. ప్రతిపక్ష వైసిపి కి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని హెచ్చరిస్తున్నారు. శాంతి భద్రతలు టిడిపి తోనే సాధ్యమని చెబుతున్నారు. అన్ని వర్గాలను టిడిపి ఎలా ఆదుకుందో గుర్తుంచుకోవాలని ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ది పొందిందని తిరిగి అధికారం అప్పగిస్తే మరింత సొమ్ము అందిస్తామని చెప్పుకొస్తున్నారు. నిరుద్యోగభృతిని సైతం మూడువేలరూపాయలు చేసేస్తామని అంటున్నారు చంద్రబాబు. 


నేతల నాలుకకు నరం లేదా..

ఏడు పదులు దాటినా తన ప్రత్యర్థులతో సమానంగా బాబు సాగిస్తున్న ప్రచారం హోరెత్తిపోతుంది.అనుభవం ఉందని అవకాశం ఇచ్చారు. రాష్ట్రాన్ని తన స్వలాభానికి నిండా ముంచారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి బాబు వస్తే జాబు పోతుందని నిరూపించారు. అమరావతి ని, పోలవరాన్ని అరచేతిలో వైకుంఠం చేశారు. డ్వాక్రా మహిళలకు ఇవ్వలిసింది కొండంత అయితే ఇచ్చింది ఇసుమంత ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన టిడిపి అధినేత చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రచారం ఉదృతం చేశారు వైసిపి అధినేత జగన్. ఇక అన్ని వర్గాలపై తమ పార్టీ ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు వైసిపి చీఫ్.ఎప్పుడు వీరిద్దరేనా ? మార్పు తీసుకురండి జనసేనను గెలిపించి నిజమైన అభివృద్ధి కి సహకరించండి అంటున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అధికార విపక్షాలపై దుమ్మెత్తిపోస్తూ ఆయన తన సభల్లో ఆవేశంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రధాన పార్టీలకు ధీటుగా ఉచిత సిలిండర్ల హామీని పదేపదే గుర్తు చేస్తున్నారు. నిరుద్యోగులకు పాతికేళ్ల భవిత కావాలంటే తన వెంట నడవాలని పిలుపునిస్తున్నారు పవన్ .జనసేన అధినేత చేసే ప్రసంగాల్లో వైసిపి పై టిడిపి తరచూ చేసేవి కావడంతో ఓటర్లలో తీవ్ర చర్చ నడుస్తుంది. అదే సమయంలో టిడిపి….జనసేన ప్రస్తావన ఎక్కువ లేకుండా ప్రచారం సాగిస్తుండటంతో ఆ రెండు పార్టీలపై అనుమానాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారన్నది అంచనా వేయడం కష్ట సాధ్యం గా మారింది.

No comments:

Post a Comment