Breaking News

01/04/2019

ఆరోగ్య పథకం అవహేళన ముఖ్యమంత్రి తెలివి తక్కువ తనానికి నిదర్శనం

మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ 
హైదరాబాద్ ఏప్రిల్ 1 (way2newstv.in)  
వ్యాధుల నివారణకు రోగి కి వైద్యుడు ఎల అవసరమో అలాగే దేశం లో నెలకొని ఉన్న అనేక సామజిక వ్యాధుల నివారణకు  ఒక మంచి  వైద్యుడు అవసరమని ఎం పి మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ  అన్నారు.ఈ ఐదు సంవత్సరాలలో నరేంద్ర మోడీ అనేక సమస్యలకు ఒక మంచి వైద్యుడి తరహాలో చికిత్స ను  అందించారు అలాగే మరొక్కసారి మోడీ బలపరచాల్సింది గా డాక్టర్స్ కి  దత్తాత్రేయ పిలుపునిచ్చారు. "మరొక్క సారి మోడీ ప్రభుత్వం" అంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని వైద్యులు ఏర్పాటు చేసిన డాక్టర్స్ మీట్ లో  ఆయన పాల్గొని ప్రసంగించారు.నరేంద్ర మోడీ సమ్మిళిత అభివృద్ధి కి పాటుపడుతున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నారు. 


ఆరోగ్య పథకం అవహేళన ముఖ్యమంత్రి తెలివి తక్కువ తనానికి నిదర్శనం

ఇది ప్రపంచం లోనే అత్యంత పెద్దదయినా ఆరోగ్య భీమా పథకం అని చెప్పారు. దీని ద్వారా దేశం లోని దాదాపు 10 కోట్ల కుటుంబాలకి నేరుగా ప్రయోజనం దక్కనుందని తెలిపారు. ఇంతటి పథకాన్ని మన రాష్ట్రం లో అమలు చేయకపోవడం దుర్మార్గమని దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేసారు. ఆరోగ్య శ్రీ భీమా పరిధి కేవలం 2  లక్షలు కాగా, ఆయుష్మాన్ భారత్ లో ఇది 5 లక్షలు గా ఉంది. ఆరోగ్య శ్రీ లో కేవలం 949  వ్యాదులకే చికిత్స లభ్యం అవుతుండగా ఆయుష్మాన్ భారత్ పరిధి లో  1350 వ్యాధులు వస్తాయని చెప్పారు. ఇలాంటి ఆరోగ్య పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం ముఖ్యమంత్రి గారి తెలివితక్కువ తనానికి నిదర్శనం అని అయన విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము  దాదాపు 1054  రకాల మందులను అత్యవసర మందుల జాబితా లో చేర్చడం వల్ల  వాటి ధరలు తగ్గి అవి సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి వైద్య రంగం లో విశేషమైన నిదులని అందిస్తుందని చెప్పారు. కేంద్రం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.3600  కోట్ల ను అందించింది అయన తెలిపారు . ఇవే కాకుండా కేంద్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము లో ఏయిమ్స్ ని సైతం నెలకొల్పింది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బి జె పి అభ్యర్థి  జి.కిషన్ రెడ్డి, ఐ ఎం ఏ అధ్యక్షులు  ప్రతాప్ రెడ్డి, డాక్టర్ సురేష్ గౌడ్, డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ విజయ్ మోహన్, డాక్టర్ ఆవుల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment