Breaking News

01/04/2019

ఎన్నికల నియమావళిని విధిగా పాటించండి

కర్నూలు, ఏప్రిల్ 01 (way2newstv.in)  
భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఎన్నికల నియమావళిని అధికారులందరు తప్పక పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం వెలగపూడి నుంచి రాష్టానికి సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ గా నియమింపబడిన కె.కె శర్మ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్లతో ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జిల్లా పోలీస్ అబ్జర్వర్ అతుల్ వర్మ, ఐపీఎస్ , కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ రూపక్ కె.ఆర్.మజుందార్, నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ వినీత్ కుమార్, రాయలసీమ డీఐజీ నాగేంద్ర కుమార్, ఎస్పీ పక్కీరప్ప, జిల్లాకు వచ్చిన ఎన్నికల అబ్జర్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు స్వేచ్ఛగా తన ఓటును వేసేలా అధికారులు ఎన్నికల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల్లో తగినంత పోలీస్ బలగాలను నియమించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 


ఎన్నికల నియమావళిని విధిగా పాటించండి 

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలన్నారు. పెయిడ్ న్యూస్, ప్రకటనలు, సోషల్ మీడియా కు సంబందించిన వాటిపై  ఎం సి ఎం సి కమిటీ ఎప్పటికప్పుడు నోటీసులను జారీచేయాలన్నారు. ఎంసీసీ, సెక్టోరల్ అధికారులు, ఎస్ ఎస్ టి , ఇన్కమ్ టాక్స్, ఆబ్కారీ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ లాంటి అన్ని కమిటీలు భాద్యతాయుతంగా పనిచేయాలన్నారు. అబ్జర్వర్ల సమక్షంలో ఈవీఎంల రెండవ ర్యాండ మైజేషన్ ను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్ సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. 300 క్రిటికల్, 30 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 1950 కాల్ సెంటర్ నుంచి 17,536 , సి-విజిల్ ద్వారా 401 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. పోలింగ్ సామగ్రిని తరలించేందుకు 780 బస్సులు అవరమౌతాయని , ఇందులో 430 ఆర్ టి సి బస్సులు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన బస్సులను త్వరలో సిద్ధం చేసుకుంటామన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ ను ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. ఎస్పీ పక్కిరప్ప మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అక్రమ మద్యం, నగదు, గోల్డ్, సిల్వర్ ను పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచమన్నారు. చెక్ పోస్టులందు సి సి కెమెరాలను వాడుతామన్నారు. జిల్లా పోలీస్ అబ్జర్వర్ అతుల్ వర్మ, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ రూపక్ కె.ఆర్.మజుందార్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై తాము గమనించిన విషయాలను తెలియ చేశారు. 
ఈ కార్యక్రమంలో ఏఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, డిఆర్వో వెంకటేశం, ఆర్వోలు,  ఏఆర్వోలు, ఎంపిడీవోలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment