కలకత్తా ఏప్రిల్ 30 (way2newstv.in)
రానున్న రోజుల్లో మీకు ప్రభుత్వాన్ని నడిపించడం కష్టంగా మారనుందని మోడీ హెచ్చరించారు. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజలను దారుణంగా మోసగించారని, ఈ ప్రభుత్వం అవినీతిమయమైందని దుయ్యబట్టారు. ‘దేనికి అనుమతి, అడ్మిషన్ ఇవ్వాలన్నా ప్రజలు డబ్బులు చెల్లించాల్సిందే. దాన్ని వ్యతిరేకించిన వారిని మమత ప్రభుత్వం శిక్షిస్తుంది’ అని విరుచుకుప్డడారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చెలరేగడంతో అధికార టీఎంసీ మీద బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘ఇది దీదీ అణచివేత పరిపాలనకు నిదర్శనం. ఇక్కడ చొరబాటు దారులు హాయిగా నివసించవచ్చు.
ప్రజలను మోసం చేస్తున్న దీదీ: మోడీ
కానీ దేశ భక్తులు, రామ భక్తులు, దుర్గా భక్తులు, సరస్వతి భక్తులు ప్రమాదం అంచున నివసిస్తున్నారు. దుండగులకు ఇక్కడ భద్రత ఉంది. ఆడవారి భద్రతకు మాత్రం గ్యారంటీ లేదు’ అని మోడీ విమర్శలు చేశారు.ప్రధాని మోడీ మాటల దూకుడుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఒక వైపు కాంగ్రెస్ పార్టీ గొడవ పెడుతున్నా కూడా మోడీ మాటలకు అడ్డేలేకుండా పోతున్నది. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నమోడీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది శాసనసభ్యులు తనతో టచ్‌లో ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఈ 40 మంది ఎం ఎల్ ఏలు త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్‌ను వీడతారని బిజెపితో చేరుతారని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేనెల 23న ఫలితాలు వెల్లడికాగానే వారు తమవైపు వచ్చేస్తారన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సీరామ్‌పుర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ మాట్లాడుతూ..‘దీదీ, మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అన్నిచోట్లా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని విడిచి వెళ్లిపోతారు. ఇప్పటికే మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు’ అని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment