Breaking News

30/04/2019

ప్రతి పక్షాలవి భయంతో కూడిన ధైర్యం

విజయం మనదే
- టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు
- అందరికీ రుణ పడి ఉంటాను : ఆదిరెడ్డి భవానీ  
రాజమహేంద్రవరం ఏప్రిల్ 30  (way2newstv.in)    
 రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి విస్తోంది.... ఆ గాల్లో సైకిల్‌ తునా తునకలైపోతుంది.... 130 సీట్లు కైవసం చేసుకుంటాం అంటూ ప్రతిపక్ష పార్టీ వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారం వట్టి గాలి మాటలని, ఏం మాట్లాడాలో తెలియక భయంతో వస్తున్న మాటలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకోవడం తధ్యమని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నొక్కి ఒక్కానించారు. రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్డులోని హోటల్‌ జగదీశ్వరీలో తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావు విగ్రహానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆధికారంలోకి వచ్చేని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. 


ప్రతి పక్షాలవి భయంతో కూడిన ధైర్యం

ఆ విషయంలో కార్యకర్తలు ఎటువంటి సందేహాలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. విజయం తెలుగుదేశం పార్టీదే అనేందుకు తమ వద్ద స్పష్టమైన సర్వే రికార్డులు ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేశారని అన్నారు. తన కుటుంబం పట్ల నగర ప్రజలు చూపించిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన ఉత్సాహాన్నే త్వరలో జరగనున్న కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో సిఎం చంద్రబాబునాయుడు క షి వలన, పార్టీ కార్యకర్తల కష్టం వలన తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, రాజమహేంద్రవరంలో పార్టీ జెండా రెపరెపలాడబోతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే వస్తుందని, అయితే ఈసారి మాత్రం అన్యాయంతో పాటు అవమానం కూడా జరిగిందన్నారు. ఈ విషయాలను ఎన్నికలకు ముందు చెబితే పార్టీకి నష్టం కలుగుతుందని భావించి మౌనం వహించానని అన్నారు. మే నెలాఖరున ఒక సమావేశం నిర్వహించి మనసులో విషయాలను స్పష్టం చేస్తానన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తే పారిశ్రామికవేత్తలను, కోటీశ్వరులను తీసుకువస్తారని, పదవులను అనుభవించిన వారు ఇప్పుడు ఎందుకు సమావేశాలకు రాలేదని ప్రశ్నించారు. మళ్ళీ ఎన్నికలు వస్తే వారికే ప్రాధాన్యత ఉంటుందని, ఈసారి ఎన్నికల్లో అభ్యర్ధుల విషయంలో తన ప్రమేయం ఉండబోదన్నారు.  ఎన్నికల సమయంలో తాను విదేశి పర్యటనలో ఉంటానని పేర్కొన్నారు. ఒకవేళ స్థానికంగా ఉన్నా ఎన్నికల్లో పాల్గొనదలుచుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఈసి, సిఎస్‌ లు కక్ష సాధిస్తూ పరిపాలనను అడ్డుకుంటున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరని, పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ తన విజయం కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలంతా వారి ఇంటి సొంత ఆడపడుచులా తనను ఆదరించి ప్రోత్సాహమిచ్చారని, ఆ ప్రోత్సాహాన్ని జీవితంలో తానెప్పుడూ మరచిపోలేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో అందించిన  సహకారం జీవితాంతం గుర్తుంటుందన్నారు. మనందరిలో తెలుగుదేశం పార్టీ విజయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మనందరి అండ నారా చంద్రబాబునాయుడేనని, ఓట్ల లెక్కింపు తరువాత అధిక మెజార్టీ సీట్లతో చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రై, ఎప్పటి లాగే రాష్ట్రంలోని ప్రతి ఇంటి పెద్ద దిక్కుగా నిలిచి అందరికీ అండలా ఉంటారని అన్నారు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ( వాసు) మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పార్టీ కేడరంతా అలుపెరుగని పోరాటం చేశారన్నారు. 2014 నుంచి 2019కి వచ్చే సరికి ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్ని ఆటంకాలు వచ్చినా... కేంద్రం ఎన్ని కుతంత్రాలు చేసినా... ప్రతి పక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుయుక్తులు పన్నినా వాటన్నింటీని దాటుకుంటూ ప్రజల పక్షాన్నే నిలవాలన్నది చంద్రబాబునాయుడి నినాదమని, అందుకే ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్నే నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అందరికీ మంచి పునాది వేశాసరని, ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీదే అధికారమన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అసలు ఎందుకు ఓట్లు పడతాయో ఆ పార్టీ వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అధికారులు ఒక పక్షానికి కొమ్ము కాచారని, అందుకు సంబంధించిన వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, త్వరలో చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ సమావేశంలో శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌, శెట్టిబజలి, గౌడ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాలిక శ్రీను, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి, కోసూరి చండీప్రియ, గరగ పార్వతి, తంగెళ్ల బాబి, మాటూరి రంగారావు, బెజవాడ రాజ్‌కుమార్‌, ద్వారా పార్వతి సుందరి, ఇన్నమూరి రాంబాబు, పెనుగొండ విజయభారతి, కొమ్మా శ్రీనివాస్‌, మర్రి దుర్గాశ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగు, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, కురగంటి సతీష్‌, మజ్జి రాంబాబు, షేక్‌ సుభాన్‌, బుడ్డిగ రాధ, కవులూరి వెంకటరావు, కొయ్యల రమణ, పెనుగొండ రామకృష్ణ, అంగురు ధనరాజ్‌, కడితి జోగారావు, మరుకుర్తి రవియాదవ్‌, ఆశపు సత్యనారాయణ, పిడిమి ప్రకాష్‌, కరగాని వేణు, మండలి రవి, మళ్ల వెంకటరాజు, పితాని కుటుంబరావు, బొమ్మనమైన శ్రీనివాస్‌, తలారి భగవాన్‌, పొడవల శ్రీను, జాగు వెంకటరమణ, మాలే విజయలక్ష్మి, కర్రి రమణమ్మ, గొర్రెల రమణి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment