Breaking News

30/04/2019

ఫొని తుపాను ముందస్తు సహాయంగా ఏపికి రూ.200.25కోట్లు విడుదల

న్యూఢిల్లీ ఏప్రిల్ 30 (way2newstv.in)    
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించి ముందస్తుగా నిధులు విడుదల చేసింది. ఎన్నికల వేళ ఫొని తుపాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు , రాష్ట్రాలకు కేంద్రం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ.1086కోట్లను విడుదల చేసింది. 


ఫొని తుపాను ముందస్తు సహాయంగా ఏపికి రూ.200.25కోట్లు విడుదల  

ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.200.25కోట్లు, ఒడిశాకు రూ.340.87కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ. 233.50కోట్లు కేటాయించారు. తుపాన్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందస్తుగా తుపాన్ బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా తుపాను కారణంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది..

No comments:

Post a Comment