Breaking News

08/04/2019

పార్కింగ్ సమస్యలకు పరిష్కారాలు

హైద్రాబాద్,  ఏప్రిల్ 8, (way2newstv.in)
హైదరాబాద్ ట్రాఫిక్ కోసం కార్పోరేట్ కంపినీలు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఆశావాహంగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేశాయి. నివాసమైనా...నివాసేతర నిర్మాణమైనా..భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ప్రాంగణంలోనే పార్కింగ్ సౌకర్యాన్ని కల్సించాలి. కానీ ఈ నిబంధనలు గ్రేటర్ లో ఎక్కడ అమలు కావటం లేదు. ఉన్న కొద్దిపాటి సదుపాయం నివాసేతర భవనాల్లో పెయిడ్ పార్కింగ్ గా మారింది. అయితే తాజాగా ప్రభుత్వం నయా పార్కింగ్ రూల్స్ ప్రకటించింది. మాల్స్, మల్టిప్లెక్స్ లు, వాణిజ్య స్థలాల్లో ఉచితంగా పార్కింగ్ సదుపాయాన్ని కల్సించాలని ఆదేశించింది. అయినా కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తునే ఉన్నారు. ఇది నగరంలో మెజారిటీ ప్రాంతాల్లో దుస్థితి..హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ టాటా కన్సెల్ టెన్సీ కంపెనీలలో మాత్రం కార్పోరేట్ సంస్థలు సరికొత్త పార్కింగ్ విధానాన్ని కల్సిస్తున్నాయి. వారికి కేటాయించిన స్థలాలోనే చక్కటి నాలుగైదు అంతస్తుల భవనాలను నిర్మించి అందులోనే అందరిని ఆకర్షించే విధంగా వాహనాలను పార్కింగ్ చేసుకునేటట్లు చేస్తున్నాయి. నానక్ రాంగూడాలో మైక్రసాఫ్ట్ కంపెనీ ఉంది. వేలాది మంది ఆ సంస్థలో పనిచేస్తారు. అయితే వారందరి వాహనాలు నిలుపుకునేందుకు ప్రత్యేక పార్కింగ్ బ్లాక్ లను నిర్మించారు. గ్రౌండ్ ప్లస్ నాలుగంతస్తులుగా ఉన్న భవనంలో వాహనాలు పార్క్ చేస్తున్నారు. 


పార్కింగ్ సమస్యలకు పరిష్కారాలు

అదే విధంగా గచ్చిబౌలిలోని టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ లో కూడా గ్రౌండ్ ప్లస్ అంతస్తుల లానే స్పెషల్ పార్కింగ్ బ్లాక్ అందుబాటులో ఉంది. ఇవే కాకుండా చాలా చోట్ల కూడా ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఇది ఐటి కారిడార్ లో పరిస్థితి.. ప్రతిరోజు తిరిగే ప్రదేశాలలో మాత్రం పార్కింగ్ దోపిడి జరుగుతూనే ఉంది. మల్టిప్లెక్స్ లో కావచ్చు, షాపింగ్ మాల్స్ లో కావచ్చు ఇలా ప్రతిఒక్క చోట కూడా నిత్యం పార్కింగ్ డబ్బుల వసూలు చేస్తునే ఉన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏప్రిల్ 1 నుండి మల్లిప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ లాంటి మేజర్ ప్రదేశాలలో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్సించింది. కానీ కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రం ఇంకా పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇలా హైదరాబాద్ లో చాలా చోట్ల ఇంకా పార్కింగ్ వసూళ్ళ మోత మోగుతూనే ఉంది. దీనిని అరికట్టాలని ప్రజలు వాపోతున్నారు. ఐటీ కంపెనీల్లో ఉన్న మాదిరిగానే ప్రతిచోట కూడా పార్కింగ్ బిల్డింగ్ లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.ఐటీ కంపెనీల్లో అలాంటి సౌకర్యాలు కల్సిస్తేనే ప్రతి ఒక్కరు కూడా వారివారి పనిని ఉత్సాహంగా చేసుకుంటారు. ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగులు ఎంచక్కా వారి సంస్థల ఏర్సాటు చేసిన పార్కింగ్ బిల్డింగ్స్ వాహనాలను పార్క్ చేసుకుని పనిని చేసుకుంటున్నారు. కానీ మామూలు గా సిటీలో తిరిగే వారు మాత్రం పార్కింగ్ స్థలాలు లేక ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకుని ఎప్పుడు వారి వాహనాలు ఎవరు తీసుకెలతారో అని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. పట్టణ నిబంధనల ప్రకారం వాణిజ్య కేటగిరి భవనాలకు నిర్మాణ విస్తీర్ణంలో 44శాతం, ఐటీ కార్యాలయాల్లో 66శాతం పార్కింగ్ స్థలంగా వదలాలి. ఐటీ సంస్థల్లోని పార్కింగ్ లో 60శాతం ఉద్యోగులకు 6శాతం సందర్శకులకు కేటాయించుకుంది. దీని ప్రకారము నడుచుకుంటు అందరిని మెప్పిస్తున్నాయి ఐటీ సంస్థలు..ఐటీ కంపెనీలు మాత్రం తమ పార్కింగ్ సదుపాయాలతో అందరికి ఆదర్శంగా  నిలుస్తున్నాయి. వీటిని చూసి ప్రతిఒక్కరు కూడా హైదరాబాద్ మొత్తంలో కూడా ఇలాంటి సదుపాయాలు రావాలని ఆశపడుతున్నారు. ఇక స్సందన బాగుంది కాబట్టి ఐటీ కంపెనీలు కూడా మున్ముందు ఇంకా ఇలాంటి పార్కింగ్ లను నిర్మించటానికి ఆసక్తి చూపుతున్నాయనే చెప్పాలి..

No comments:

Post a Comment