Breaking News

25/03/2019

ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

నెల్లూరు, మార్చి  25(way2newstv.in)
అధికార, ప్రతిపక్షపార్టీలు అప్పుడే ఓటర్లును ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నామినేషన్‌ ఘట్టంలో తమ సత్తా ఏమిటో చూపించడానికి శుక్రవారం ఒక్క రోజే రూ.కోట్లు కుమ్మరించారు. నామినేషన్‌కు వచ్చిన జనానికి మద్యం, డబ్బు, చీరా, సారేలతో ఆకట్టుకోడానికి ప్రయత్నం చేశారు. ఒకరిని మించి మరొకరు జనసమీకరణ చేశారు. మంత్రి పి. నారాయణ అనుచరులు నగరంలో హంగమా చేశారు. ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య భారీ ఎత్తున డబ్బు ఖర్చుపెట్టారు. మొత్తం నామినేషన్లను ఎన్నికల సంఘం పరిశీలిచింది. పార్లమెంట్‌ అభ్యర్థులకు రూ.75 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థులకు రూ.28 లక్షలు మాత్రమే ఖర్చుచేయాల్సి ఉంది.


ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

కొందరు అభ్యర్థులు నామినేషన్‌కే మొత్తం డబ్బు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. ఈ పోటీలో కోటేశ్వర్లు, శత కోటేశ్వర్లు మాత్రమే నిలుస్తున్నారు. ఎన్ని రూ.కోట్లు ఖర్చుపెట్టి అయినా గెలవాలనే సిద్ధపడుతున్నారు. ఒకరిని మించి ఒకరు ఖర్చుపెడుతున్నారు. టిడిపి, వైసిపి నేతలు ఖర్చులకు వెనుకాడడం లేదు. జనాలకు డబ్బు, మద్యం, చీరలు పంపిణీ చేసే కార్యక్రమం అప్పుడే చేపట్టారు.  నెల్లూరు నగరం మంత్రి పి. నారాయణ భారీ జన సమీకరణ చేశారు. నగరంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలను తరలించారు. మహిళలకు రూ.250, పురుషులకు రూ.300 మంది పంపిణీ చేసినట్లు తెలిసింది. కొందరికి మద్యం పంపిణీ చేశారు. కొన్నిచోట్ల చీర, జాకెట్‌ పంపిణీ చేసినట్లు సమచారం. పంపిణీకి సిద్ధంగా ఉన్న 150 చీరలను పోలీసులు పట్టుకున్నారు

No comments:

Post a Comment