Breaking News

25/03/2019

మండుతున్న కూరల ధరలు

హైద్రాబాద్, మార్చి  (way2newstv.in)
బీన్స్‌ ధరలు చుక్కలనంటాయి. తానేమీ తీసుపోలేదని పొటల్స్‌ ధరలు కూడా కొండెక్కాయి. అల్లం ఘాటెక్కింది. నగరంలోని 13 రైతు బజార్లలో ఈ వారం కూరగాయల ధరలు పెరిగాయి. కొన్నింటి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ముఖ్యంగా బీన్స్‌ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత వారం కిలో రూ.60గా ఉన్న బీన్స్‌ ధర ఈ వారం రూ.74కి చేరింది. పొటల్స్‌ ధరలు రూ.40 నుంచి రూ.62కి పెరిగాయి. అల్లం రూ.82 నుంచి 84కి, బీరకాయలు రూ.36 నుంచి రూ.38కి, కాకరకాయలు రూ.30 నుంచి రూ.36కి, బంగాళా దుంపలు రూ.8 నుంచి రూ.9కి, ఆగాకర కాయలు రూ.50 నుంచి రూ.60కి, 


మండుతున్న కూరల ధరలు

బీట్‌ రూట్‌ రూ.20 నుంచి రూ.22కి, టమాటా రూ.14 నుంచి రూ.16కి, చిక్కుడు కాయలు రూ.28 నుంచి రూ.32కి, దేవుడు చిక్కుడు రూ.24 నుంచి రూ.32కి, క్యాప్సికం రూ.42 నుంచి రూ.44కి, బరబాటి రూ.22 నుంచి రూ.24కి, ముల్లంగి రూ.16 నుంచి రూ.18కి పెరిగాయి.ధరలు తగ్గిన వాటిలో ఉల్లిపాయలు రూ.13 నుంచి రూ.12కి, చేమ దుంపలు రూ.26 నుంచి రూ.24కి, మిర్చి తెలుపు రూ.26 నుంచి రూ.24కి, మిర్చి నలుపు రూ.26కి, దొండకాయలు రూ.26 నుంచి రూ.24కి, కంద రూ.28 నుంచి రూ.24కి తగ్గాయి. ధరల్లో ఎటువంటి మార్పు లేని వాటిలో బెండకాయలు ఉన్నాయి. వీటి దర రూ.34, తెల్ల వంకాయలు రూ.22, నల్ల వంకాయలు రూ.32, క్యాబేజీ రూ.14, క్యారెట్‌ రూ.24, గోరుచిక్కుడు రూ.24, కర్రపెండలం రూ.16, కాలీప్లవర్‌ రూ.20, ఆనపకాయ రూ.10, అరటికాయలు పెద్దది రూ.6, చిన్నది రూ.4, పచ్చి బఠాణి రూ.36, బీన్స్‌ పిక్కలు రూ.40, వెల్లుల్లి రూ.46గా ఉన్నాయి. గుడ్లు డజను రూ.50 ధర పలికాయి

No comments:

Post a Comment