హైదరాబాద్, మార్చి 09 (way2newstv.in)
సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి మొదటి సారి అత్యధిక మెజారిటీతో గులాబీ జెండా రెపరేపలాడడం ఖాయని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేసారు. ఈ నెల 13న సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియజక వర్గం సన్నాహక సమావేశం ఏర్పాట్లను ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, స్టీఫెన్ సన్, మాజీ హోంమంత్రి నాయిని నర్సిహ్మ రెడ్డి తదితరులతో కలసి అయన శనివారం పర్యవేక్షించారు.
పదహారు స్థానాలు మావే
మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి విజయం సాధించడమే కాకుండా తెలంగాణలోని 16ఎంపిలను గెలుస్తామని అన్నారు.. ప్రతిపక్షాలు పోటీ చేయాలి కాబట్టి అభ్యర్ధులను నిలబెడతారు.. గెలువులో మాకు మేమే పోటీ. ఏ నియోజకవర్గం నుండి ఎవరు ఎక్కువ మెజారిటీ తెస్తారని ఉంది తప్ప ఇతరుల పోటీ లేరని అన్నారు..
No comments:
Post a Comment