Breaking News

09/03/2019

ఆరోసారి రెడీ అంటున్న సోనియా

న్యూఢిల్లీ, మార్చి 9, (way2newstv.in)
అనారోగ్యం పీడిస్తున్నా… వయసు మీదపడుతున్నా ఆమె మళ్లీ పోటీకి ఎందుకు సై అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలిలో ఆమె తిరిగి పోటీ చేసేందుకు ఎందుకు సిద్ధమయ్యారు..? పార్టీని గాడిన పెట్టడానికేనా? లేక యువనేత రాహుల్ నాయకత్వంపై మిత్రుల్లో నమ్మకం ఇంకా ఏర్పడనందునే క్రియాశీలకంగా వ్యవహరించాలనా? మొత్తం మీద సోనియా గాంధీ మరోసారి లోక్ సభ బరిలో ఉంటారన్న వార్త కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం నింపేదే. గత కొన్నేళ్లుగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అనారోగ్య కారణాల వల్లనే ఆమె చురుగ్గా పాల్గొన లేకపోతున్నారన్నది కూడా నిజమే.వరుసగా జరిగిన గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ దూరంగా ఉన్నారు. అంతా రాహుల్ గాంధీయే చూసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటమి చెందగా మరికొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించింది. 


ఆరోసారి రెడీ అంటున్న సోనియా

రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా చేసిన సోనియా ఇక పాలిటిక్స్ కు దూరంగా ఉంటారని అందరూ ఊహించారు. అయినా అడపా దడపా టెన్ జన్ పథ్ నుంచి ఆమె కీలక సమయాల్లో తన నిర్ణయాలను చెబుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపిక సోనియాగాంధీ సూచనల మేరకే జరిగింది.ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ సీనియర్ కాంగ్రెస్ నేతలతో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ వర్క్ అవుట్ కావడం లేదు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ దారి తాము చూసుకున్నా ఎన్నికల తర్వాత అవన్నీ కాంగ్రెస్ గొడుకు కింద వస్తాయంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు రాహుల్ ను లెక్క చేయడం లేదు.ఈ దశలో పార్టీని ఆమె వెనకుండి నడిపిస్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాయబరేలీ నియోజకవర్గంలో పోటీకి సోనియా సిద్ధమయ్యారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలకు కావాల్సిన సంఖ్యలో సీట్లు దక్కితే అప్పుడు ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడంలో సోనియా కీలకం కానున్నారు. రాహుల్ వల్ల ఇది కాదని భావించి అనారోగ్యంతో ఉన్నప్పటికీ సోనియా పోటీకి సిద్ధమయ్యారన్నది టెన్ జన్ పథ్ టాక్. ఆమె వరసగా ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆరోసారి రెడీ అవుతున్నారు.

No comments:

Post a Comment