హైద్రాబాద్, మార్చి 12, (way2newstv.com)
టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.2001లో జెడ్పీ ఎన్నికల్లో మొత్తం ఆలేరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌తో ఏమీ కాదని అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు ప్రజల చేత తిరస్కరించబడ్డారు. ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం పట్టుకుంది.
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలో..కార్యకర్తలు గ్రామగ్రామాన వివరించాలని కేటీఆర్ కోరారు. కేంద్రంలో ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ల రాష్ర్టాలకే ప్రయోజనాలు కలుగుతున్నయని కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ లాంటి పథకాలు ఎన్నో రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. రాహుల్‌గాంధీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీతతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
No comments:
Post a Comment