Breaking News

08/03/2019

పక్క దారి పడుతున్న సబ్సిడీ సిలిండర్లు

హైద్రాబాద్, మార్చి 8, (way2newstv.in)
నగరంలో ఎల్పీజీకీ ఉన్న డిమాం డ్‌ను దృష్టిలో ఉంచుకుని అనేక ఏజెన్సీలు సబ్సిడీ గ్యాస్ సిలిం డర్లను ప్రైవేటుకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.అక్రమ సంపాదనకు అల వాటు పడిన గ్యాస్ ఏజెన్సీలు అక్రమ దందాకు తెరతీస్తూ సబ్సిడీ గ్యాస్‌ను మార్కెట్‌లోకి వక్రమార్గంలో సరఫరా చేస్తూ నిజమైన లబ్ధి దారులకు ఇబ్బందులు పెడుతున్నారు. బ్యాక్‌లా గ్‌లు, డోర్‌లాక్ పేరుతో బుకింగ్ అనధికారికంగా క్యాన్సిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు హోటళ్లు, ఎల్పీజీ వాహనాలకు అధిక ధరలకు విక్రయిస్తూ వినియో గదారులకు ఇవ్వాల్సిన సిలిండర్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఇండేన్, భారత్, హెచ్‌పీ ఏజెన్సీలు జాప్యం విషయంలో ఒకదానితో మరొకటీ పోటీ పడుతున్నాయి. వినియోగదా రులనే తమ కార్యాలయాలకు లేదా గోడౌన్ల వద్దకు వచ్చి సిలిండరు తీసుకెళ్లాలని ఏజెన్సీలు సూచిస్తు న్నాయి. గ్యాస్ బుక్ చేసుకొని బిల్ జనరేట్ అయ్యాక కనీసం 15 నుంచి 20 రోజుల తర్వాత డెలివరీ చేస్తున్నారు. 




 పక్క దారి పడుతున్న సబ్సిడీ సిలిండర్లు

అందులో పద్మ గ్యాస్ ఏజెన్సీ, షేక్ పేట్‌లోని కీర్తి ఏజెన్సీ, మాధవి ఏజెన్సీలతో పాటు మరికొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఇష్టారీతిలో ్యవహ రిస్తున్నాయి. వీరిని నియంత్రించా ల్సిన పౌరసరాఫరాశాఖ అధి కారు లు, ఐవోసీఎల్ బాధ్యులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఏజెన్సీలలో పద్మ గ్యాస్ ముందు వరుసలో ఉంది. దీనిపై విని యోగదా రులు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఇదే తీరు కొన సాగిస్తున్నా పద్మ ఏజెన్సీపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ తంతూ గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలో నిత్యం మామూలేనని వినియోదారులు ఆరోపిస్తు న్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాక బుకింగ్ కన్ఫ ర్మేషన్ నెంబర్‌తో రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది.అనంతరం క్యాష్ మెమో జనరేట్ అవు తుంది. క్యాష్ మెమో జనరేట్ అయ్యాక.. కచ్చి తంగా 48 గంటల్లో సిలిండర్ జనరేట్ కావా ల్సిందే. ఏదైనా సాంకేతిక కారణాలతో డెలివరీ కాకున్నా బుకింగ్ క్యాన్సిల్ కాదు. సిలిండర్ డెలివరీ సమయంలో డోర్‌లాక్ ఉన్నా..బుకింగ్ క్యాన్సిల్ కాదు. మొదటిసారి వెళ్లి నప్పుడు డోర్‌లాక్ ఉంటే రెండు లేదా మూడు రోజులు గడువు ఇచ్చి మరోసారి వెళ్లాలి. ఇలా మూడుసార్లు వెళ్లాక కూడా డోర్‌లాక్ ఉంటే క్యాన్సిల్ చేయాలి.వినియోగదారులు వ్యక్తిగత వాహనాలపై తీసుకెళ్లే అవకాశం లేదు. కచ్చితంగా ఏజెన్సీలే డెలీవరి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. విని యోగదారుడి ఇంటి వద్దకు ఏజెన్సీలు సిలిండర్ పంపించినందుకు సరిపడా చార్జీ కూడా వినియో గదారుడు చెల్లించే మొత్తం ఉంటుంది.గ్యాస్ బిల్లు మీద ఉన్న మొత్తానికి ఒక పైసా కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు. డెలివరీ బాయ్ అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. గ్యాస్ బుకింగ్ అయ్యాక ఎన్ని రోజుల్లో బుక్ చేయాలనే అంశంపై నిబంధనలు ఎక్కడా లేవు. గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న వినియోగదా రులకు మూడు, నాలుగు రోజుల్లో త్వరలో రీఫిల్ డెలివరీ జరుగుతుందని సెల్‌ఫోన్‌లో మెసేజ్ వస్తుంది. కానీ రీఫిల్ మాత్రం రావడం లేదు. అవసరం ఉంటే మీ సొంత వాహనం తీసుకువచ్చి తీసుకెళ్లండి లేదంటే ఇచ్చినప్పుడు తీసుకోండి అంటూ ఓ గ్యాస్ ఏజెన్సీ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు వినియోగదారులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్‌కు ఇబ్బంది లేదని, సరిపడా స్టాక్ ఉందన్నారు. గ్రేటర్‌లో 32 లక్షల వినియోగదారులు ఉన్నా రని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీఎల్) కో-ఆర్డినేటర్ లలిత తెలిపారు. కొంత బ్యాక్‌లాగ్‌లు ఉన్నమాట వాస్తవమేనని, ఐనా వారం రోజులకు మించి జాప్యం జరగవద్దని అన్నారు. ఆలస్యం తదితర సమస్యలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, దానికోసం మా వెబ్‌సైట్ mylpg.inను ఓపెన్ చేస్తే ఫిర్యాదుకు సంబంధించిన ఆప్షన్ కనబడుతుందని అన్నారు. లేదంటే టోల్‌ఫ్రీ నెంబరు 18002333555 ఫిర్యాదు చేయవచ్చని, తెలుగు, హిందీ, ఆంగ్లం లో అందుబాటులో ఉంటుందని అన్నారు.నెలరోజుల కిందట గ్యాస్ బుక్ చేసుకున్నాం. ఇప్పటి వరకు డెలివరీ ఇవ్వలేదు. మధ్యలో గ్యాస్ డెలివరీ జరుగుతుందని మెసేజ్ వచ్చింది. గ్యాస్ కోసం ఎదురు చూస్తే రీఫిల్ క్యాన్సిల్ అయినట్లు మరో మెసేజ్ వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే మీ ఇంటికి తాళంవేసి ఉందని అంటున్నారు. డెలివరీ ఇవ్వడానికి ఎవరూ రాకుండానే తాళంవేసి ఉందంటున్నారు. గ్యాస్ కావాలంటే ఖాళీ సిలిండర్ తెచ్చుకోమంటున్నారు. మా గ్యాస్ ఏజెన్సీలో వినియోగదారులకు సత్వర సేవలు అందిస్తున్నాం. కొన్నిరోజుల కిందట పద్మారావునగర్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ సీజ్ చేయడం వల్ల వినియోగదారులకు మేమే సర్వీస్ చేస్తున్నాం. వినియోగదారులకు సరిపడా ఉన్న సిబ్బంది ఇప్పుడు ఇతర గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు కూడా సర్వీస్ అందించాల్సి వస్తోంది. చిరునామాలు వెతకడంలో ఇబ్బందులు ఎదురై ఆలస్యం అవుతోంది. 

No comments:

Post a Comment