హైద్రాబాద్, మార్చి 8, (way2newstv.in)
పేదోడి ఫ్రిజ్ మట్టి కుండలకు మంచి డిమాండ్ వచ్చింది. మండుతున్న ఎండలకు సిటీ జనం దాహార్తిని తీర్చుకునేందుకు మట్టి కుండలు, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఎండలు ఎక్కువగా ఉండటంతో బిజినెస్ బాగుందంటున్నారు వ్యాపారులు.సిటీలో మట్టి వాసనకు మళ్లీ డిమాండ్ వచ్చింది. సమ్మర్ రాకముందే మట్టి కుండలు, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. ఉన్నోడైనా.. లేనోడైనా సమ్మర్ లో ఎక్కువగా కుండలను వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.సమ్మర్ వస్తే చాలు చాలా మంది మట్టి కుండలకు ట్యూన్ అయిపోతున్నారు.
కుండలకు పెరిగిన గిరాకీ
ప్రకృతిలో నుంచి వచ్చేది ఏదైనా ప్రసాదం లాంటిదని చెబుతున్నారు నగరవాసులు.గతంతో పోలిస్తే ఈ సారి కుండల రేట్లు బాగా పెరిగాయంటున్నారు కస్టమర్లు. ఫ్రిడ్జ్ లు కొనే స్థోమత లేకపోవడంతో మట్టి కుండలతో సరి పెటుకుంటున్నామని చెబుతున్నారు. కుండల క్వాలిటీకి కూడా అంతగా లేదంటున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్ లోకి కొత్త డిజైన్స్ వచ్చాయంటున్నారు వ్యాపారులు. పెయింటింగ్ కుండలు , ఫిల్టర్ టాప్ కుండలు , రాజస్థాన్ కుండల కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి ఎండలు ముందుగానే రావడంతో వ్యాపారం బాగుందని చెబుతున్నారు.ఇక హెల్త్ విషయానికి వస్తే కుండలోని నీరు తాగడంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకపోవడంతో కుండలకే ప్రాధాన్యత ఇస్తున్నారు జనం. చిన్నపిల్లలకు కూడా ఫ్రిజ్ వాటర్ కంటేకుండలో నీళ్లు తాగిస్తే మంచిదంటున్నారు.ఎండ వేడిని తట్టుకోలేక బయట కూల్ డ్రింక్స్, రోడ్ సైడ్ జ్యూసులు తాగే బదులు మట్టికుండలే నీరు తాగాలని మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment