Breaking News

14/03/2019

సన్నాఫ్ చంద్రబాబు నాయుడు....

విజయవాడ, మార్చి 14, (way2newstv.in)
నారా చంద్రబాబునాయుడు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో మాదిరి ఆయనకు ఎలాంటి అడ్వాంటేజీలు లేవు. ఏడాది క్రితం వరకూ ఆయన ఆలోచన ఒకరకంగా ఉండేది. భవిష్యత్తులో తన తనయుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలన్నది. మంత్రిగా అనుభవం వచ్చింది కాబట్టి ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. నారా వారి కుటుంబసభ్యుల కోరిక కూడా అదే. తాను కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించిన తర్వాత లోకేష్ కు ఛాన్స్ ఇవ్వాలని ఆలోచించారు.అందుకోసం సీనియర్ నేతలను పక్కన పెట్టి వారి వారసులను రంగంలోకి దించాలని ఏడాది క్రితమే భావించారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల వారసుల్లో ఎవరెవరు? రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు…? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోయినప్పటికీ మంచి పేరున్న యువనేతలు ఎవరు? అన్న దానిపై డేటా సేకరించి ఉంచారు. 


సన్నాఫ్ చంద్రబాబు నాయుడు....

ఎన్నికల సమయంలో సీనియర్లకు కాకుండా వారి వారసులకు ఇస్తే కొంత ఛేంజ్ ఉంటుందని, భవిష్యత్తులో లోకేష్ ఏజ్ గ్రూపుగా ఉంటుందని కూడా చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించారు.అయితే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఎన్నికలకు ముందు ప్రకటించిన సంక్షేమ పథకాలు సయితం పెద్దగా వర్క్ అవుట్ అయ్యేట్లు లేవు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెబ్బ గట్టిగానే పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఐటీగ్రిడ్ వ్యవహారంతో పార్టీ భారీగానే డ్యామేజ్ అయింది. ఇది లోకేష్ అపరిపక్వతతో చేసిందన్నది చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ దూకుడు ముందు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో లోకేష్ బ్యాచ్ ను పక్కన పెట్టేయాలన్న యోచనకు వచ్చారట.దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో సీనియర్లను కాదని వారి వారసులకు టిక్కెట్లు ఇస్తే దెబ్బతింటామేనన్న భయం చంద్రబాబులో ఉంది. అందుకే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కూడా తిరిగి ఆయననే పోటీ చేయమని కోరారు. అయ్యన్నపాత్రుడిని సయితం ఈసారికి మీరే పోటీ చేయమని అయ్యన్నను కూడా ఆదేశించారు. పరిటాల సునీతను కూడా పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఒక్క కేఈ కృష్ణమూర్తి విషయంలోనే ఆయన ఏమీ చెప్పలేకపోయారంటున్నారు. మిగిలిన సీనియర్ నేతల వారసుల ఎంట్రీ ప్రతిపాదనకు మాత్రం ఈసారికి నో చెప్పినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment