Breaking News

07/03/2019

వైవీ కినుక కారణం ఏమిటబ్బా...

ఒంగోలు, మార్చి 7, (way2newstv.in
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి జగన్ కుటుంబంతో దగ్గర సంబంధం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైవీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వైవీసుబ్బారెడ్డికి, ఆయన బావ బాలినేని శ్రీనివాసులు రెడ్డికి మధ్య విభేదాలు ఎన్నికలు దగ్గరపడే సమయంలో మరింత ఎక్కువయ్యాయి. బాలినేని శ్రీనివాసులురెడ్డి మాగుంటను వైసీపీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ తనకు ఎర్త్ పెడుతున్నారన్న అనుమానం వైవీలో బలంగా నాటుకుపోయింది. దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ కూడా వైవీని రాజ్యసభకు పంపాలన్న యోచనలో ఉన్నారువైవీని రాజ్యసభకు పంపాలన్న జగన్ యోచన ఈనాటిది కాదు. ఒంగోలు పార్లమెంటు స్థానంతో పాటు, టీడీపీని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో బలహీన పర్చాలంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలన్నది జగన్ పాదయాత్ర సమయంలోనే తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. 



 వైవీ కినుక కారణం ఏమిటబ్బా...

అయితే దీన్ని బయటకు చెప్పకుండా వైవీ వద్ద రాజ్యసభ ప్రస్తావనను పలుమార్లు జగన్ తీసుకువచ్చినా వైవీ విముఖత చూపినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపడం వెనక కూడా జగన్ ఆలోచన వేరే విధంగా ఉందంటున్నారు ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతినింది. 19 శాననసభ నియోజకవర్గాలున్న తూర్పుగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో ఐదుస్థానాలను మాత్రమే వైసీపీ గెలుచుకుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో జీరో రిజల్ట్ సాధించింది. దీంతో ఆ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలను సమన్వయం చేసేందుకు ఒక నేత అవసరమని జగన్ గుర్తించారు. అందుకు వైవీయే సరైన వ్యక్తి అని భావించారు. ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేస్తే వైవీ మిగిలిన ప్రాంతాలపై దృష్టి పెట్టలేరు. అందుకోసమే మాగుంటకు టిడీపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చి, వైవీని రాజ్యసభకు పంపాలన్న యోచన జగన్ చేశారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం జగన్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం వైవీకి రుచించడం లేదంటున్నారు. తాను ఖచ్చితంగా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని వైవీ చెబుతున్నారు. మాగుంటను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బాలినేని పై గుర్రుగా ఉన్న వైవీ ఇటీవల విజయవాడలో జగన్ గృహప్రవేశానికి కూడా హాజరు కాలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వైవీ తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మొత్తం మీద వైవీకి రాజ్యసభ సీటు ఖాయమనే మాట పార్టీ వర్గాల నుంచి విన్పిస్తుంది. మరి జగన్ వైవీని ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

No comments:

Post a Comment