Breaking News

21/03/2019

23 లో ఆరుగురికి దక్కని లక్

విజయవాడ, మార్చి 21, (wway2newstv.in)
అభివృద్ధి పేరిట… చంద్రబాబు తప్ప ఎవరి వల్ల నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యం కాదని నమ్మారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నా… అధికారంలోకి రాకపోవడంతో దాదాపు 23 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు పార్టీలను మారారు. అధికార పార్టీలోకి వెళ్లి మరోసారి అందలం ఎక్కుదామని ఆశ పడ్డారు. జగన్ కు దూరమైనా చంద్రబాబు తమను దగ్గరకు తీస్తారని ఆశపడ్డారు. కానీ తన కోసం పార్టీ మారి వచ్చిన వారిని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యకర్తల మనోభీష్టం మేరకే అభ్యర్థులను నిర్ణయించామన్నారు.టీడీపీ కార్యకర్తలు సర్వేల్లో ఏం చెబుతారు? ఎవరి పేర్లు చెబుతారు? గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన టీడీపీ అభ్యర్థి పేరే సహజంగా కార్యకర్తలు చెబుతారన్నది వాస్తవం. వీరు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు. అధికారులను కూడా తమ గుప్పిట్లో ఉంచుకుని అనధికార ఎమ్మెల్యేలుగా అనేకమంది కొనసాగిన మాట వాస్తవం. అయితే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత జంప్ చేసిన వారిలో ఆరుగురికి టిక్కెట్లు ఇవ్వలేదు. 


 23 లో ఆరుగురికి దక్కని లక్ 

వీరిలో కొందరు బలమైన నేతలున్నప్పటీకి సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా వారికి నో చెప్పేశారు.కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా సైకిలెక్కి నియోజకవర్గంలో తెగదిరిగారు. తీరా ఎన్నికల సమాయానికి వచ్చేసరికి కందికుంట్ల వెంకటప్రసాద్ తన్నుకు పోయారు. ఇక యర్రగొండపాలెం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన డేవిడ్ రాజుకు టిక్కెట్ దక్కలేదు. అక్కడ టీడీపీ అభ్యర్థి అజితారావుకు చంద్రబాబు కేటాయించారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి టిక్కెట్ దక్కలేదు. ఇక బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములును కూడా పక్కన పెట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన తిరిగి వైసీపీలో చేరారు.
ఇక తన సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్వీ మోహన్ రెడ్డికి కర్నూలు అర్బన్ టిక్కెట్ ఇవ్వలేదు. అక్కడ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు కేటాయించారు. ఇక పార్టీ మారిని ముగ్గురు పార్లమెంటు సభ్యులను కూడా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఎంపీ అభ్యర్థులకు కొన్ని స్థానాల్లో చంద్రబాబు నానాయాతన పడినా పార్టీ మారి వచ్చిన వారికి మాత్రం టిక్కెట్లు ఇవ్వలేదు. బుట్టారేణుక, ఎస్పీవై రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. ఇక కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టుకుని వెళ్లిపోయారు. మొత్తం మీద గత ఎన్నికలలో వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఆరుగురికి మాత్రం చంద్రబాబు టిక్కెట్లు నిరాకరించారు. వీరిలో జయరాములు బీజేపీలో చేరి బద్వేలు నుంచి పోటీలో ఉండగా మిగిలిన వారు తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.

No comments:

Post a Comment