Breaking News

21/03/2019

నెరవేరని లక్ష్యం.. (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, మార్చి 21 (way2newstv.in): 
కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదిలోపు విద్యుత్తులేని ఇల్లు ఉండరాదన్న లక్ష్యంతో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకాన్ని 2018 జనవరిలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా విద్యుత్తు మీటరు లేని వారికి కేవలం రూ. 125కే విద్యుత్తు కనెక్షన్‌ అందిస్తోంది. ఈ డబ్బు సైతం చెల్లించలేని స్థితిలో ఉంటే వారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసి విడతల వారీగా వసూలు చేస్తోంది. 2018 డిసెంబర్‌ నాటికి నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లా కలిపి 22,040 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇది నెరవేరలేదు. దీంతో దీని గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఇది ఈ నెలాఖరుతో ముగుస్తున్నా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించడం లేదు.
మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 2018 డిసెంబర్‌ నాటికి 22,040 గృహాలకు ఈ పథకం ద్వారా విద్యుత్తు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నారాయణపేట మండలంలో 2,204 గృహాలను గుర్తించి ఇందులో 1,750 మందికి మీటర్‌, సర్వీస్‌ తీగ, ఎల్‌ఈడీ లైటు, బోర్డు, ఎంసీపీలను అందజేశారు. ఇంకా 454 గృహాలకు మీటర్లను బిగించలేదు. ధన్వాడ, మరికల్‌ రెండు మండలాలకు కలిపి ఇంత వరకు 2118 గృహాలను గుర్తించిన అధికారులు 1,908 గృహాలకు సామగ్రిని అందజేశారు. ఈ మండలాల్లో ఇంకా 210 గృహాలకు సామగ్రి పంపిణీ చేయాల్సి ఉంది. 



నెరవేరని లక్ష్యం.. (మహబూబ్ నగర్)

దామరగిద్ద మండలంలో 2,008 గృహాలను గుర్తించి 1,788 గృహాలను మీటర్లు బిగించి సరఫరా అందించారు. ఇక్కడ ఇంకో 220 గృహాలకు మీటర్లను బిగించాల్సి ఉంది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఏ మండలంలో గుర్తించిన అన్నిఇళ్ల్లకు విద్యుత్తు సామగ్రిని బిగించ లేదు. లక్ష్యానికి దూరంగా ఉన్న విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు సైతం మరో 20 రోజులు దాటితే ముగుస్తుంది. ప్రస్తుతం పెంచిన గడువు సమయంలో నారాయణపేట మండలంలో 46 గృహాలను, ధన్వాడలో 78, మరికల్‌లో 48 గృహాలను మాత్రమే గుర్తించారు. ఇంకా గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి.
పెంచిన గడువుపై ప్రచారం కొరవడింది.. ఇటీవల ధ]న్వాడలో జరిగిన మండ]ల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న విద్యుత్తు అధికారులు ఆటోల ద్వారా వీధి వీధిలో ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సభ ముగిసి వారం రోజులు కావస్తున్నా ఆ విధంగా తీసుకున్న చర్యలేవీ కనిపించడం లేదు. రూ.125కే మీటర్‌ అన్న విషయం తెలియని వినియోగదారులు రూ.1400 చెల్లించుకుంటూ నష్టపోతున్నారు. ముగింపు గడువు సమీపిస్తున్న దృష్ట్యా ఇకనైన విద్యుత్తు అధికారులు రూ.125కే మీటర్‌ పథకం వివరాలు విస్తృతంగా ప్రచారం చేయాలి. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉచిత విద్యుత్తు అంశంపైనే వినియోగదారులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ పథకంలో వంద రీడింగ్‌ వరకు మాత్రమే ఉచిత విద్యుత్తు ఉంటుందని ఈ డబ్బులను మాత్రమే సబ్‌ప్లాన్‌ భరిస్తుంది. నిబంధనలు ఇలా ఉంటే వినియోగదారులు మాత్రం ఖర్చు పెట్టిన విద్యుత్తు మొత్తం ఉచితమేనన్న భావనలో ఉంటూ బిల్లులు చెల్లించడంలేదు. దీనిపైన వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment