Breaking News

28/02/2019

విశాఖపట్టణంలో కోస్ట్ గార్డ్ హై అలెర్ట్

విశాఖపట్టణం, ఫిబ్రవరి 28, (way2newstv.in)
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులపై భారత్‌ వాయుసేన బల గాలు దాడి చేసిన నేపథ్యంలో దేశంలోని పలు మేజర్‌ పోర్టులు అంతర్గతంగా అప్రమత్తమయ్యాయి. మేజర్‌ పోర్టుల వద్ద జరిగే వాణిజ్య సంబంధమైన కార్యకలాపాలను మరింత కట్టుదిట్టం చేశాయి. సముద్ర తీర రక్షక దళం  భద్రతను సాధారణ స్థాయి నుంచి రెండో స్థాయి భద్రతకు పెంచడం జరిగింది. ముఖ్యంగా తూర్పు తీరంలో గల ఏడు మేజర్‌ పోర్టుల్లోనూ ఉన్నతాధికారులు తాజా పరిస్థితిపై సమీ క్షలు నిర్వహించి భద్రత విషయంలో పలు జాగ్రత్తలు తీసు కుంటున్నట్లు తెలుస్తోంది. విశాఖ తూర్పునౌకాదళానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఘటన పాకిస్తాన్‌లో జరిగినా పలు రకాలుగా 'గ్లోబల్‌ ఇంపాక్ట్‌' ఉంటుందన్నది పలువురు మేథా వులు, నావికాదళ నిపుణులు భావిస్తున్నారు. 2016 ఫిబ్రవరి లో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ  కూడా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. 


విశాఖపట్టణంలో కోస్ట్ గార్డ్  హై అలెర్ట్

ఆ సందర్భంగా 50 దేశాలు తమ త్రివిధ దళాల సాధన సంపత్తిని ప్రదర్శిం చాయి. దేశంలోని నావికాదళ కమాండ్స్‌లోకెల్లా విశాఖ తూర్పునౌకాదళం భౌగోళికంగా విస్తారమైనదే గాకుండా శతృదుర్భేజమైనదనేది వాస్తవం. తూర్పు తీరంలో గల సహజ సిద్ధమైన సంపద పరిరక్షణలో కూడా నౌకాదళ పాత్ర గణ నీయమైనది. విశాఖపట్నం చమురు క్షేత్ర ఉత్పత్తికి దేశంలో ముఖ్య స్థావరాల్లో ఒకటిగా ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా వీటిని పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత త్రివిధ దళాలపైనే ఉంటుంది. దేశంలో జరిగే పెట్రోలియం ఉత్పత్తి, అనంతరం రవాణాకు సంబంధించి తూర్పుతీరం కూడా కీలక పాత్రనే పోషిస్తున్నందున భద్రత, సురక్షిత విషయంలో ప్రభుత్వాలు ఇలాంటి సందర్భాల్లో అప్ర మత్తం అవుతున్నాయి. మంగళవారం ఒడిశా ఓడరేవులో అలర్ట్‌ను ప్రకటించాయి. ఇండియన్‌ నేవల్‌ స్టేషన్‌  డేగా కూడా విశాఖలో ఉన్నందున ఈ ప్రాంతం లో కూడా కేంద్ర భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమై కట్టుదిట్టం చేశాయి. 1971లో ఇండియా- పాకిస్తాన్‌ యుద్ధ సందర్భంలో కూడా ఇఎన్‌సి ఆపరేషన్స్‌ కీలక పాత్ర పోషిం చాయి. ప్రస్తుత దాడులు కూడా 1971 నాటి ఉదంతాన్ని తలపిస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. నాడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా పాక్‌పై యుద్ధం చేసిన భారత్‌.. పాక్‌ దేశ రాజధాని లాహోర్‌ వరకూ వెళ్లి మరీ దాడులు చేశాయి. ఇప్పుడు అదే తీరున నరేంద్రమోడీ ప్రధానిగా ఉండగా అదే స్థాయిలో లోపలకు చొరబడడం కనిపిస్తున్నదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1999లో జరిగిన కార్గిల్‌ వార్‌ సమయంలో కూడా ఈ రకంగా జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నరేంద్రమోడీ నాయకత్వం కటువుగా పాకిస్తాన్‌కు సమా ధానం చెప్పినట్లు పలువురు మేధావులు పేర్కొంటున్నారు

No comments:

Post a Comment