Breaking News

04/02/2019

రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్, ఫిబ్రవరి 04:(way2newstv.in):
 30 వ రోడ్ సేఫ్టీ వారోత్సవాలని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమనికి  తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ,  సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లు ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. డిజిపి రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్,  అడిషనల్ డిజిపి లా అండ్ ఆర్డర్ జితేందర్ , ,రాచకొండ సిపి మహేష్ భగవత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  రోడ్ సేఫ్టీ పై రూపొందించిన పోస్టర్ ని పోలీస్  అధికారులతో కలిసి హోమ్ మంత్రి విడుదల చేశారు. ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ఈ రోజు నుండి 11 వ తేదీ వరకు కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు.  


 రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ

హోమ్ మినిష్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ వయసులో అవగాహన ఉండదు ఏవిదంగా వాహనం నడపాలని. తెలంగాణ పోలీస్ దేశం లోని మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హోమ్ మంత్రి తెలంగాణా పోలీస్ లని అభినందించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు ప్రాముఖ్యత ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ కూడా నూతనంగా నిర్మాణం చేస్తున్నారు. మన సేఫ్టీ సెక్యురిటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ కోసం చాలా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేప్పుడు ఫోన్ మాట్లాడకండి.   4 లక్షల కెమెరాలు పెట్టడం జరిగింది. ఓవర్ స్పీడ్ చేయకండి. గంటకు 60 నుండి 70 స్పీడ్ లో వెళ్ళండి. సిటీలో 30 స్పీడ్ వెళ్ళండి.ఆపదలను ఆహ్వానించి కుటుంబ సభ్యులకు బాధని కల్గించవద్దని అయన ప్రజలను కోరారు.  

No comments:

Post a Comment